ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.. దీంతో అప్రమత్తమైన కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.. ఇక, ఈ కొత్త వేరియంట్‌పై రాజ్యసభలో క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. భారత్‌లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు.. ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో మాట్లాడిన ఆయన… ఒమిక్రాన్ వేరియంట్‌ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.. ఎయిర్‌పోర్ట్‌ల వద్ద స్క్రీనింగ్ చేస్తున్నామని, పాజిటివ్…
దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీకి సిద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ.. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశంలో పెరుగుతోన్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణాన్ని వ్యతిరేకిస్తూ ‘జన జాగరణ్ అభియాన్’ పేరుతో కాంగ్రెస్ మెగా ర్యాలీని చేపట్టనుంది. పెరిగిన ధరలకు నిరసనగా నవంబర్ 14 నుంచి 29 వరకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ “జనజాగరణ్ అభియాన్” నిర్వహించింది.. ఇక, దానికి ముగింపుగా ఢిల్లీలో డిసెంబర్ 12వ తేదీన భారీ ర్యాలీ ఉంటుందని ప్రకటించింది..…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలిరోజే రచ్చతో మొదలయ్యాయి… ప్రతిపక్షాల ఆందోళనలతో సభ ప్రారంభమైన వెంటనే గంట పాటు వాయిదా వేశారు లోక్‌సభ స్పీకర్.. మరోవైపు రాజ్యసభలోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్ అయ్యింది.. అయితే, దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చలు జరగాలని ఆకాక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రాజ్యాంగ దినోత్సవం స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని సూచించిన ఆయన.. ప్రతీ ప్రశ్నకు జవాబిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందు మీడియాతో మాట్లాడిన…
పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్, రాజ్యసభలో టీడీపీ నాయకుడు కనకమేడల రవీంద్ర కుమార్, వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయ సాయిరెడ్డి హాజరవుతారు. టి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోకసభ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు అఖిలపక్షానికి హాజరవుతారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాల…
ఆశతో హస్తినకు వచ్చాం.. కానీ, కేంద్ర ప్రభుత్వం నిరాశపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. యాసంగిలో వరి వేయొద్దని కేంద్రం గట్టిగా చెప్పిందని తెలిపారు. మేం ఎంతో ఆశతో వచ్చాం.. కానీ, కేంద్రం నిరాశపరిచిందన్న ఆయన.. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించాం.. కానీ, నిరాశే మిగిలిందన్నారు. కేంద్రమంత్రితో జరిగిన సమావేశంలో.. కేంద్రం ఎంత…
వడ్లు కొనుగోలు వ్యవహారంలో గత కొంత కాలంగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది.. కేంద్రం చెప్పేది ఒక్కటైతే.. రాష్ట్ర నేతలు మాత్రం రైతులను తప్పుదోవపట్టిస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. కేంద్రం స్పష్టంగా చెప్పినా.. టీఆర్ఎస్ ప్రభుత్వమే డ్రామా చేస్తుందని బీజేపీ విమర్శిస్తుందో.. ఇక, దీనిపై మరింత క్లారిటీ కోసం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందానికి నిరశే ఎదురైంది.. తెలంగాణలో యాసంగిలో పండించే వడ్ల కొనుగోలుపై కేంద్రం నిరాశే మిగిల్చింది. యాసంగి వడ్లను కొనేందుకు కేంద్రం…
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రకటించిన ఓ పథకం ఇప్పుడు వివాదాస్పందంగా మారింది. 60 ఏళ్లకు పైబడిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. 60 ఏళ్లు నిండిన వ్యక్తులు ఢిల్లీ నుంచి దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లి వచ్చేందుకు టికెట్లను ఫ్రీగా అందిస్తుంది. దీనికోసం ఢిల్లీ సర్కార్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అయితే, కరోనా కారణంగా ఇప్పటి వరకు ఈ పథకం అమలు కాలేదు. కాగా, డిసెంబర్ 3…
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దూపై ఢిల్లీ సీఎం ప్రశంసలు కురిపించారు. గత ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో పాటు, ఇప్పటి సీఎం చరణ్ జిత్ సింగ్ చేతిలో కూడా సిద్దూ అణిచివేతకు గురవుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సిద్దూ ధైర్యాన్ని తాను ప్రశంసించానని, రాష్ట్రంలో క్యూబిక్ అడుగు ఇసుకను రూ.5 కు అమ్ముతున్నట్టు ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చెప్పగా, అది అబద్దమని, రాష్ట్రంలో క్యూబిక్ అడుగు ఇసుకను రూ. 20 కి అమ్ముతున్నట్టు…
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తానన్న తన వాగ్దానాన్ని త్వరగా నెరవేర్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రివర్గం తెలిపింది. దీనికి సంబంధించి ‘ది ఫార్మ్ లాస్ రిపీల్ బిల్లు, 2021’ ఆమోదం కోసం తీసుకోనుంది. న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి లోక్‌కల్యాణ్ మార్గ్ నివాసంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశం కానుంది. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకో వడానికి ఒక సమగ్ర “రద్దు బిల్లు” మాత్రమే తీసుకురావచ్చని…