దేశంలో కోవిడ్ ముప్పు తొలగడం లేదు. గత కొంతకాలంగా తక్కువగా నమోదవుతున్న కేసులు తిరిగి పెరగడం ప్రారంభించాయి. క్రమంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళన పెంచుతున్నాయి. తాజాగా 9195 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 77,002 వున్నాయి. మరోవైపు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి ఒమిక్రాన్ వేరియంట్ కేసులు. దేశంలో మొత్తం 781 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ లో అత్యధికంగా 238 కేసులు నమోదు కావడంతో ఆందోళన కలుగుతోంది.
నిన్నటి “కోవిడ్” కేసులు కంటే ఈ రోజు 44 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయి కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రాల వారీగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు ఇలా వున్నాయి.
ఢిల్లీలో 238 కేసులు.. రికవరీ అయినవారు 57
మహారాష్ట్రలో 167 కేసులు రికవరీ అయినవారు 72
గుజరాత్‌లో 73 కేసులు రికవరీ అయినవారు 17
కేరళలో 65 కేసులు రికవరీ అయినవారు1
తెలంగాణలో 62 కేసులు రికవరీ అయినవారు 10
రాజస్తాన్‌లో 46 కేసులు రికవరీ అయినవారు 30
కర్నాటకలో 34 కేసులు రికవరీ అయినవారు 18
తమిళనాడులో 34 కేసులు రికవరీ అయినవారు 16
హర్యానాలో 12 కేసులు రికవరీ అయినవారు 02
పశ్చిమ బెంగాల్ 11 కేసులు రికవరీ అయినవారు 01
ఒమిక్రాన్ కేసులు మొత్తం 781 కాగా రికవరీ అయి డిశ్చార్జ్ అయిన వారు 241మంది. ఒమిక్రాన్ కేసుల తీవ్రత నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలవుతున్నాయి. జనవరి 31 వరకూ ఆంక్షలు అమలులో వుంటాయి. అంతర్జాతీయంగా వచ్చే ప్రయాణికులకు కఠినమైన స్క్రీనింగ్ చెయ్యాలని, ఆర్టిపిసిఆర్ పరీక్షలను నిర్వహించాలని కేంద్రం సిఫార్సు చేసింది.భారత SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం ప్రకారం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికుల పరిచయాలను నిశితంగా ట్రాక్ చేసి పరీక్షించాలి. పాజిటివ్‌గా మారిన ప్రయాణికుల నమూనాలను వెంటనే నియమించబడిన జీనోమ్ సీక్వెన్సింగ్ లాబొరేటరీలకు పంపాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.