బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు మూడు రోజుల సమ్మెపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి పార్లమెంట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ర్ట ప్రభుత్వ ప్రయోజనాల కోసమే ఈ సమ్మె కొనసాగిందని పార్లమెంట్లో ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. తెలంగాణలో నాలుగు బొగ్గు గనుల వేలాన్ని ఆపి వాటిని సింగరేణి సంస్థకు అప్పగించాలని సోమవారం లోక్‌సభలో జీర్ అవర్‌లో అత్యవసర ప్రజాప్రయోజనాల అంశం కింద కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన డిమాండ్‌పై ప్రహ్లాద్ జోషి…
రెండు రోజుల తర్వాత ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు ఇవాళ కూడా కొనసాగాయి. ఇన్నాళ్లు రైతు సమస్యలపై దద్దరిల్లిన ఉభయ సభలు.. ప్రస్తుతం 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజే నిబంధనలు ఉల్లంఘించినందుకు 12 మంది విపక్ష ఎంపీలను సభను నుంచి సస్పెండ్ చేస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఎంపీల సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం అంటూ .. తమ…
ఇస్లామిక్ సంస్థ అయిన తబ్లీగీ జమాత్ పై నిషేధం విధిస్తున్నట్లు సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. తబ్లీగీ జమాత్‌తో ప్రజలకు, సమాజానికి పెను ముప్పు పొంచి ఉందని ఈ విషయాన్ని మసీదులకు తెలియజేయాలని, ఆ సంస్థ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. కాగా, 1926లో ప్రారంభమైన ఈ సంస్థకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 30-35 కోట్ల మంది ముస్లింలు తబ్లిగీని అనుసరిస్తున్నట్టు సమాచారం కాగా గతంలో కరోనా మొదటి వేవ్…
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. జింబాబ్వే నుంచి ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కి చేరింది. ఢిల్లీలో మాత్రం ఇప్పటివరకు రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ఓమిక్రాన్ సోకిన వారికి స్వల్ప లక్షణాలే ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. దేశంలో మహారాష్ట్రలో ఎక్కువగా ఓమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో ఆ రాష్ట్రానికి…
రాత్రికి రాత్రి మొక్క పెరిగి పెద్ద కాదు. అందుకు సమయం పడుతుంది. అలాగే, పంట పండించడానికి సహనం కావాలి. ముందు భూమిని దున్నాలి. తరువాత విత్తనాలు చల్లాలి. అవి మొలకెత్తి పెరుగుతున్నపుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరో విధంగా చెప్పాలంటే, చైతన్యం, ఆశ, భయం, నమ్మకం, అప్రమత్తత వీటన్నిటి కలయికే వ్యవసాయం. ఉద్యమంలో భాగంగా రైతులు చేసింది కూడా ఒక విధమైన వ్యవసాయమే. 2020 నవంబర్ 26న పంజాబ్ రైతులు ఇళ్లు విడిచి ఢిల్లీ వెళ్లారు. రాజధాని సరిహద్దుల్లో…
వ్యవసాయ చట్టాలపై అలుపెరుగని పోరాటం చేసిన రైతులు తాత్కాలికంగా తమ పోరాటానికి విరామం ప్రకటించారు. ఇవాళ ఉదయం నుండి ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తున్నారు రైతులు. శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సొంత రాష్ట్రాలకు ప్రయాణం అవనున్నారు రైతులు. మూడు నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో సరిహద్దులు ఖాళీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఢిల్లీ సరిహద్దులు సింగూ ,టిక్రి ,గజీపూర్ లలో సంవత్సరంపైగా(378 రోజులు) ఆందోళన చేపట్టారు రైతులు. సంయుక్త కిసాన్ మోర్చా ,భారతీయ కిసాన్ సంఘ…
నిన్న షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు ఈ రోజు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఈ రోజు బంగారం ధరలలో ఎలాంటి మార్పులు లేకుండా.. నిలకడగా ఉంది. అలాగే వెండి ధర భారీగా తగ్గింది. ప్రతి కిలో గ్రాము వెండి పై రూ. 300 వరకు తగ్గింది. అయితే ఇక దేశంలో రోజు రోజు కు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు.. కరోనా కేసులు పెరుగుతుండటం తో బంగారం, వెండి ధరల పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తుంది.…
ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు… ఇవాళ తన బాల్య స్నేహితురాలిని వివాహం చేసుకున్నారు తేజస్వి యాదవ్.. ఢిల్లీలో తేజస్వి యాదవ్-రాచెల్ వివాహ వేడుక ఘనంగా జరిగింది… ఢిల్లీలోని తేజస్వి సోదరి మిసా భారతి ఫామ్‌హౌస్‌లో ఈ వేడుక నిర్వహించారు.. కరోనా నేపథ్యంలో.. ఈ వేడకకు కుటుంబసభ్యులు, సన్నిహితులకు మాత్రమే ఆహ్వానాలు పంపారు.. ఇక, ఈ వివాహ వేడుకకు యూపీ మాజీ సీఎం…
పార్లమెంట్ శీతాకాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయనే ప్రకటించారు.. ప్రధాని మోడీతో జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు విజయసాయిరెడ్డి.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై చర్చించడానికి ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రధాని…
ఢిల్లీ శివారులో సుదీర్ఘ కాలంగా సాగుతోన్న రైతు సంఘాల ఆందోళన తాత్కాలికంగా వాయిదా పడింది.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంతో పాటు.. రైతుల ఇతర డిమాండ్లపై కూడా సానుకూలంగా ఉండడం.. కనీస మద్దతు ధరపై పాజిటివ్‌గా ఉండడంతో.. ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కనీస మద్దతు ధరపై కేంద్రం నుంచి లేఖ వచ్చిందన్నారు బీకేయూ నేత రాకేష్ టికాయత్… ఇక, ఆందోళనల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని లేఖలో ఉందని…