ఒమిక్రాన్ టెన్షన్.. రాజధానిలో ఎల్లో అలర్ట్ జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు భారత్‌ను టెన్షన్ పెడుతోంది.. దేశ రాజధాని ఢిల్లీ సహా.. మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు.. ఇలా పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి.. ఇక, ఢిల్లీలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది.. దీంతో.. అప్రమత్తమైన ఆమ్ ఆద్మీ సర్కార్.. దేశ రాజధానిలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా ఆంక్షలు మరింత కఠినతరం చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్..
అయితే, ఎలాంటి ఆంక్షలు ఉంటాయన్నదానిపై త్వరలోనే పూర్తిస్థాయి ఆదేశాలను జారీ చేయనున్నట్టు తెలిపారు. కాగా, దేశ రాజధానిలో గత 2 రోజులుగా పాజిటివిటీ రేటు 0.5 శాతంగా నమోదవుతోంది.. ఈ క్రమంలోనే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవల్ 1 అంటే ఎల్లో అలర్ట్ అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది ఢిల్లీ సర్కార్. ఇప్పటికే ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండగా.. ఢిల్లీలో 50 శాతం ఆక్యుపెన్సీతో మెట్రో, బార్లు. ప్రార్థనా మందిరాల్లో భక్తులకు నో ఎంట్రీ.. సరి-బేసీ పద్ధతిలో మాల్స్‌కు అనుమతి ఉంటుంది.. మరోవైపు.. కొత్తగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా.. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నా.. వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉందని చెప్పారు కేజ్రీవాల్. ఆక్సిజన్ వినియోగం, వెంటిలేటర్ల వాడకం పెరగలేదని దానికి ఉదాహరణగా చెప్పుకొచ్చారు కేజ్రీవాల్.
Also Read
- Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
తాజావార్తలు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?