ఒమిక్రాన్ భారతదేశాన్ని సైతం వణికిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడం, కోవిడ్-19 కేసుల సంఖ్య కూడా రోజురోజుకు అధికసంఖ్యలో నమోదు కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఆంక్షలు విధించారు. ఒమిక్రాన్ కట్టడికి మరిన్ని ఆంక్షలు విధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మార్కెట్లన్నీ వెలవెలబోతున్నాయి.
మార్కెట్ ప్రాంతంలో దుకాణాలను “ఆడ్, ఈవెన్” పధ్దతిలో తెరిచేందుకు అనుమతించారు. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన “ఎల్లో అలర్ట్“ మరి కొంతకాలం కొనసాగవచ్చు. కోవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతం దాటితే ఎల్లో అలర్ట్ జారీ అయింది. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 0.68 శాతం నమోదు. ఢిల్లీలో ఇప్పటికే అమల్లోకి వచ్చిన నైట్ కర్ఫ్యూ. థియేటర్లను మూసివేయడంతో విపరీతమైన రద్దీగా ఉండే ప్రాంగణాలన్నీ బోసిపోయాయు.
గతంలో సుమారు 20 నెలల పాటు ధియోటర్లను మూసివేశారు. సుమారు ఓ నెల క్రితమే ధియేటర్లను తిరిగి అనుమతించారు. అంతలోనే, మరలా ఆంక్షలు విధించడంతో ధియోటర్లను మూసివేశారు. స్సా, జిమ్లను కూడా మూసివేశారు. 50 శాతం సామర్థ్యంతో మెట్రో, బార్లు, ప్రైవేటు ఆఫీసులకు అనుమతించారు.
ప్రార్ధన మందిరాలకు భక్తులకు అనుమతి నిరాకరించారు. సరి-బేసి సంఖ్య విధానంలో మాల్స్ కు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతించారు.
పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఢిల్లీలో 50శాతం సామర్థ్యంతోనే బస్సుల రవాణాకు అనుమతించారు. ఆటోలు, ట్యాక్సీల్లో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంది. వేడుకలు,వివాహాలు, అంత్యక్రియలకు 20మందికి మించి ఉండకూడదని అంక్షలు విధించారు. గత అనుభవం రీత్యా ఢిల్లీ వాసులు కూడా పెద్దగా బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు.