ఢిల్లీలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో 923 కేసులు నమోదైనట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. నిన్నటి రోజున నమోదైన కేసుల కంటే ఈరోజు 86శాతం అధికంగా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటికే ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఆంక్షలు విధించారు. ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో సినిమా హాళ్లు, స్కూళ్లను మూసివేశారు. 50 శాతం సీటింగ్‌లో హోటళ్లు, మెట్రోలు, బార్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయి. ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని, ఆసుపత్రులను సిద్ధం చేసుకున్నామని, తగినంత ఆక్సీజన్ సరఫరా ఉందని ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ప్రకటించింది.
Read: అమెరికాలో దారుణం: ఒక్కరోజులో 5.12 లక్షల కేసులు…
ఒక్కసారిగా 86శాతం మేర కేసులు పెరగడంతో అధికారులు ఆప్రమత్తం అయ్యారు. కరోనా కట్టడికి కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. కరోనా నుంచి 344 మంది కోలుకోగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. కొత్త సంవత్సరం వేడుకలపై ఇప్పటికే ఢిల్లీ సర్కార్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.