కరోనా థర్డ్ వేవ్ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ విరుచుకుపడింది.. దీంతో.. కఠిన ఆంక్షల బాటపట్టింది ఆ రాష్ట్రంలోని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ సర్కార్.. అయితే, ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టాయి.. ఇప్పటికే పలు సడలింపులు ప్రకటించిన ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి మరిన్ని ఆంక్షలు సడలిస్తూ నిర్ణయం తీసుకుంది.. దీంతో.. నేటి నుంచి ఢిల్లీలో స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకోబోతున్నాయి.. మొదటి దశలో 9 నుంచి 12 తరగతుల వరకు ఆన్‌లైన్, ఆఫ్ లైన్‌లో క్లాసులు పునఃప్రారంభం కానుండగా.. ఈ నెల 14వ తేదీ నుంచి నర్సరీ నుంచి 8వ తరగతి వరకు క్లాసులు ప్రారంభించనున్నారు.. కాగా, గత 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 1,410 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Read Also: ఫిబ్రవరి 7, సోమవారం దినఫలాలు..