Green India Challenge: ఢిల్లీలో మొక్కలు నాటిన ఎంపీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాలుష్య నివారణకు విరివిగా చెట్లు నాటడమే మార్గం అంటున్నారు ఎంపీలు. తెలంగాణలో ప్రారంభమయిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశరాజధానికి విస్తరించింది. దేశ రాజధానిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమం చేపట్టింది.
ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు. కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దేశ రాజధాని ఢిల్లీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమం తీసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Also Read
నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కరోల్ బాగ్ జోన్ నరైనా ఇండస్ట్రియల్ ఏరియా పార్క్ లో రాజ్య సభ ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మొక్కలు నాటారు. పార్క్ ఖాళీ స్థలంలో మియావాకీ పద్దతిలో వెయ్యి మొక్కలు నాటి మినీ ఫారెస్ట్ ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అభివృద్ధి చేస్తోంది. నాలుగేళ్ల క్రితం తాము ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మంచి ఫలితాలు సాధిస్తూ, పచ్చదనం పెంపు దిశగా అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తున్నామని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నలుదిశలా హరిత స్ఫూర్తి విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని దశలవారీగా పూర్తిచేస్తామని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు.
యువ ఎంపీ సంతోష్ ఆదర్శవంతమైన కార్యక్రమాన్ని తీసుకున్నాడని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. రాజకీయాలకు,పార్టీలకు అతీతంగా హరిత భారత కార్యక్రమాన్ని తీసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ జైరామ్ రమేష్ ఆకాంక్షించారు. ఢిల్లీ లాంటి ప్రాంతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అత్యంత అవసరమని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు.
పర్యావరణ పరంగా ఎదురవుతున్న సవాళ్లను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపు తక్షణావసరం అని ఆ దిశగా కృషి చేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి అభినందనలు అని శివ సేన ఎంపీ అనిల్ దేశాయ్ అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో తనవంతుగా భాగస్వామ్యం తీసుకునేందుకు రాంకీ సంస్థ ముందుకు వచ్చింది. ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా తమ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ఒక పార్కు ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని కార్యక్రమంలో పాల్గొన్న రామ్ కీ సంస్ధ చైర్మన్, ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తో పాటు, ఎంపీలు జైరామ్ రమేష్, సంజయ్ సింగ్ (ఆప్), బినోయ్ విశ్వం.(సీపీఐ) అనిల్ దేశాయ్ (శివ సేన), ఏపీ నుంచి వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయ సాయి రెడ్డి తో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వంగా గీత, మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, తెలంగాణ ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, మన్నే. శ్రీనివాసరెడ్డి, మాలోత్ కవిత, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, కెఆర్, సురేష్ రెడ్డి, పసునూరు దయాకర్, పీ. రాములు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థల డైరెక్టర్ ఎన్. బలరామ్ కూడా పాల్గొని మొక్కలు నాటారు.ఈ కార్యక్రమాన్ని శశాంక్ ఆలా, ఐఏఎస్, డిప్యూటీ కమిషనర్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయం చేశారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!