యూనివర్సిటీ గ్రాంట్స్ (యూజీసీ) చైర్మన్‌గా తెలంగాణ బిడ్డ నియమితులయ్యారు.. యూజీసీ చైర్మన్‌గా తెలంగాణకు చెందిన మామిడాల జగదీష్ కుమార్‌ను నియమిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది… ఇప్పటి వరకు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్-ఛాన్సలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు జగదీష్ కుమార్… యూజీసీ చైర్మన్‌గా ఆయన ఐదు సంవత్సరాలు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం..
Read Also: రోజా తీవ్ర అసంతృప్తి..! అవసరమైతే రాజీనామాకు సై..
జగదీష్ కుమార్ స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం.. యూజీసీ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ డీపీ సింగ్ రాజీనామా చేయడంతో.. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు.. ఇక, సెర్చ్ కమిటీ ముగ్గురి పేర్లను ప్రస్తావించగా.. అందులో జగదీష్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం విశేషం. మరోవైపు, జేఎన్‌యూలో 2016లో చోటు చేసుకున్న పరిణామాల తర్వాత.. మామిడాల జగదీష్ కుమార్‌ను వీసీగా నియమించింది కేంద్రం.. ఆయన ఐదేళ్ల పదవీ కాలం గత ఏడాది జనవరిలోనే ముగిసిపోయినా.. కొత్త వీసీ వచ్చేంత వరకు కొనసాగాల్సిందిగా ఆయనను కోరింది కేంద్రం.. ఈ నేపథ్యంలో ఆయన జేఎన్‌యూ వీసీగా కొనసాగుతుండగా.. మరో కీలక బాధ్యతలను అప్పగించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం..