Presidential poll: దీదీ సమావేశానికి కేసీఆర్ దూరం.. కారణం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికల తరుణంలో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఓవైపు థర్డ్ ఫ్రంట్, కొత్త పార్టీ ఏర్పాటు వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తుంటే.. మరోవైపు.. ఎన్డీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో పడిపోయారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. దీనికోసం ఈ నెల 15న ఢిల్లీ వేదికగా కీలక సమావేశం నిర్వహించనున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని విపక్షాలకు పిలుపునిచ్చిన దీదీ.. తాను ఏర్పాటు చేసే సమావేశానికి రావాల్సిందిగా 22 మంది విపక్ష నేతలకు ఆహ్వానాలు పంపారు. అందులో భాగంగా కేసీఆర్‌కు కూడా ఆమె లేఖ పంపారు.. అంతేకాదు.. ఫోన్ చేసి స్వయంగా ఆహ్వానించారు కూడా.. అయితే, ఈ సమావేశానిక దూరంగా ఉండాలని గులాబీ పార్టీ బాస్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
Read Also: Viral: పక్షులకు ఆహారం పెడుతోన్న వృద్ధుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు
Also Read
దీదీ ఏర్పాటు చేసిన సమావేశానికి కేసీఆర్ దూరంగా ఉండడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనా అనే చర్చ కూడా సాగుతోంది.. ఇటీవల కొన్ని రాష్ట్రాల సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులను కలిసిన కేసీఆర్.. రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారంటూ ప్రకటన చేశారు.. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలిపే దిశగా దీదీ పావులు కదుపుతున్నారు.. అందులో భాగంగా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.. రేపు ఢిల్లీ వేదికగా కీలక సమావేశం జరగనుండగా.. కాంగ్రెస్ పార్టీతో పాటు 20 పైగా రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపారు.. కానీ, ఈ సమావేశానికి కేసీఆర్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట.. కాంగ్రెస్ పార్టీలో కలసి వేదిక పంచుకోవడానికి అనాసక్తితో ఉన్న గులాబీ పార్టీ బాస్.. ఆ సమావేశానికి వెళ్లకూడదనే భావనలో ఉన్నారని సమాచారం.. అయితే, టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రతినిధులను మాత్రం ఈ సమావేశానికి పంపాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!