Opposition meeting: విపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ డుమ్మా… పద్ధతి సరిగా లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడింది.. ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇవాళ్టి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.. మరోసారి ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు సాగిస్తుండగా.. ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు విపక్షాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందులో భాగంగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ఢిల్లీ వేదికగా కీలక సమావేవాన్ని ఏర్పాటు చేశారు.. బీజేపీయేతర పక్షాలకు చెందిన 20 మందికి పైగా నేతలకు ఆహ్వాలను పంపించారు.. అందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉన్నారు. అయితే, విపక్షాల సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ.
Read Also: LIVE: ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్ర పారాయణం చేస్తే ధన వర్షమే..!
Also Read
- Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
- UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
- Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
- Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
మొదట కేసీఆర్ మాత్రం వెళ్లడంలేదు… టీఆర్ఎస్ నుంచి ప్రతినిధులు వెళ్లారని ప్రచారం సాగినా.. అసలు ప్రతినిధులను కూడా పంపకూడదని టీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది.. ఆ సమావేశానికి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించడంపై టీఆర్‌ఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది… కాంగ్రెస్, బీజేపీలకు తాము సమాన దూరమని స్పష్టం చేస్తోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన పోటీ.. కాంగ్రెస్‌తో వేదిక పంచుకునే అవకాశం లేదంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు.. ఇక, రాహుల్ గాంధీ.. తెలంగాణకు వచ్చి బీజేపీని పల్లెత్తు మాట అనలేదు.. కానీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని మండిపడుతున్నాయి.
ఇక, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు అని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.. లోక్‌సభతో పాటు హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనే ఇది రుజువైందని.. కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేసింది ఆరోపణలు గుప్పిస్తున్నారు.. మరోవైపు, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం సమావేశం నిర్వహించే పద్ధతి సరిగా లేదని అంటున్నాయి గులాబీ పార్టీ వర్గాలు.. ఓ అభ్యర్థిని నిర్ణయించుకుని సమావేశం పెట్టడం సరికాదని.. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.
కాగా, ఇవాళ ఢిల్లీలో విపక్ష పార్టీల సమావేశం జరగనుంది.. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.. ఈ సమావేశానికి విపక్ష పార్టీలను, ముఖ్యమంత్రులను ఆహ్వానించారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కాంగ్రెస్ తరపున సమావేశానికి మల్లికార్జున ఖర్గే, సుర్జీవాలే, జైరాం రమేష్ హాజరుకానుండగా.. కాంగ్రెస్‌తో వేదిక పంచుకోమని టీఆర్ఎస్ స్పష్టం చేసింది.. ఇక, మమత బెనర్జీ ఆహ్వానించినవారిలో సమావేశానికి ఎవరొస్తారో, డుమ్మా కొట్టేదెవరో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే శరద్ పవార్‌తో భేటీ అయిన మమతా బెనర్జీ.. పలు విషయాలపై చర్చించారు. ఇవాళ్టి సమావేశంలో ఉమ్మడి అభ్యర్థి ప్రతిపాదనకు అంగీకరించాకే, అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు.
తాజావార్తలు
-
Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
-
UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
-
The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
-
Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
-
Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!