కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీలోకి అడుగుపెట్టింది. హర్యానాలోని బదర్పూర్ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ప్రవేశించింది.
Kamal Haasan Likely To Join Rahul Gandhi's Bhrat jodo Yatra In Delhi Tomorrow: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో సాగుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు బీజేపీని ఎండగట్టేందుకు కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన రాహుల్ గాంధీ పాదయాత్ర కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా ప్రస్తుతం హర్యానాకు…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ఈరోజు ఢిల్లీ వెళ్లారు. కొద్ది సమయంలో ఆమె ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
ఓ డ్రైవర్ కారును అతి వేగంగా నడిపాడు. కారు అదుపుతప్పి ఓ ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని బాగ్‌లోని లీలావతి స్కూల్ సమీపంలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది.
నటుడు కమల్ హాసన్ డిసెంబర్ 24న జరగనున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో కలిసి పాల్గొననున్నారు. నటుడిగా మారిన రాజకీయ నాయకుడు వచ్చే వారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో చేరనున్నారు. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం ప్రకారం సూపర్ స్టార్‌ను యాత్రలో పాల్గొనమని రాహుల్ గాంధీ ఆహ్వానించారు.
Delhi man throws 2-year-old son off building after tiff with wife: భర్యాభర్తల గొడవ కన్న కొడుకు ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. భార్యతో గొడవ పడిన వ్యక్తి రెండేళ్ల కొడుకును బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసిసే.. తాను కూడా అక్కడ నుంచి దూకాడు. వీరిద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఢిల్లీలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం ఢిల్లీలోి కల్కాజీ ప్రాంతంలోని ఓ భవనంలో నివాసం ఉంటున్న…
తన జీవిత భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను గొంతు కోసి హత్య చేసి.. ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అఫ్తాబ్ అమీన్ పూనావాలా బెయిల్ కోరుతూ శుక్రవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించారని అతని న్యాయవాది వెల్లడించారు.
Twitter: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న తర్వాత కంపెనీలో పలు విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారు. ఈ ఏడాది అక్టోబరు చివరిలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుండి ట్విట్టర్ ఉద్యోగుల జీవితాలు చాలా కష్టతరంగా తయారయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ శకం మొదలైంది. జాతీయ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించేందుకు అధినేత కేసీఆర్ హస్తినలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. రాజశ్యామల యాగం, చండీయాగం, యాగ పూర్ణాహుతిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. వేదపండితుల ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాలకు నూతన కార్యాలయంలో గులాబీ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత కార్యాలయాన్ని ప్రారంభించి.. తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు కేసీఆర్. భారత రాష్ట్ర సమితి కార్యాలయ ప్రారంభోత్సవానికి మాజీ…