మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాదిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీగా గుర్తించారు. ఈ ఉగ్రవాది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. ఇతనితో పాటు మరో ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ అనుమానిత ఉగ్రవాదులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెంగాల్ నుండి 4వేల మంది MNREGA కార్మికులతో సహా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు రైలులో ఢిల్లీకి బయల్దేరారు. అక్టోబర్ 2, 3 తేదీల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్నారు.
స్థానికంగా ఆజాద్పూర్ మండి అని పిలువబడే ఢిల్లీలోని ఆజాద్పూర్ కూరగాయల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం సాయంత్రం 5.15 గంటలకు మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
ఇండియా కూటమికి మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం చెప్పారు. భారత కూటమితో తమ పార్టీ విడిపోదని స్పష్టం చేశారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కుమారుడు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఖర్గే పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్రావ్ థాక్రే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కార్పెంటర్ అవతారం ఎత్తారు. ఇటీవల పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ సామాన్య ప్రజానీకంతో మమేకం అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూలీగా మారి సూట్కేస్ నెత్తిన పెట్టుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా గురువారం రోజు ఆసియాలో అతిపెద్ద ఫర్నీచర్ మార్కెట్ అయిన ఢిల్లీలోని కీర్తీనగర్ మార్కెట్ లో కార్మికులు, కార్పెంటర్లతో ముచ్చటించారు. మార్కెట్ సందర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
ఓ కుక్క కారణంగా ఐఏఎస్ అధికారిణి తన ఉద్యోగం పోగొట్టుకుంది. సోషల్ మీడియా, మీడియా ఛానళ్లు విపరీతంగా ఉన్న ప్రస్తుతం కాలంలో ఉన్నతాధికారిని అని ఎలా పడితే అలా ప్రవర్తిస్తే పదవి ఊడపోతుందని నిరూపితమయ్యింది. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు మైదానంలోని క్రీడాకారులను పంపించేసింది ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గా. ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు తీసుకువెళ్లారు ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గా దంపతులు. కుక్కను…
దేశ రాజధాని ఢిల్లీలోని జంగ్పురాలోని భోగల్లో ఓ భారీ చోరీ జరిగింది. ఢిల్లీలోని భోగల్లోని ఉమ్రావ్ జ్యువెలర్స్ షోరూంలో అర్థరాత్రి దొంగలు చొరబడి సుమారు రూ.25 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
దేశ రాజధాని ఢిల్లీలో బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. మెట్రో మాదిరిగానే బస్సులో ప్రయాణించే వారు కూడా 'నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్' (NCMC) సౌకర్యాన్ని పొందనున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని బస్సుల్లో కూడా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.