Bribery Case: ఓ ప్రైవేట్ కంపెనీ యజమాని సహా ఏడుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ వ్యక్తులు టెండర్ కోసం లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ టెండర్ ఒడిశాలోని ఓ పాఠశాలకు సంబంధించి రూ.19.96 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ప్రధాని నరేంద్ర మోడీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అలాగే ప్రధాని మోడీ కూడా తన బర్త్ డే రోజున న్యూఢిల్లీలోని ద్వారకలో యశోభూమిగా పిలిచే ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ తొలి దశను నేడు ప్రారంభించనున్నారు.
లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను అక్టోబర్ 4కు న్యాయస్థానం వాయిదా వేసింది.
ఢిల్లీ ప్రభుత్వం భవన కార్మికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టనుంది. ఈ నేపథ్యంలో మొబైల్ వ్యాన్లను ఉపయోగించి ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలోని లేబర్ సైట్ లలో పనిచేస్తున్న భవన కార్మికుల పేర్లను నమోదు చేస్తున్నారు. దీనిద్వారా వీలైనంత ఎక్కువమంది కార్మికుల్ని గుర్తించే అవకాశం వుంది.
ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతుండడంతో కేబినెట్ ముందుకు ప్రత్యేక ఎజెండా రానుందని, పలు కీలక అంశాలు కూడా ఆమోదం పొందే అవకాశం ఉంది.
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ విచారణ మంగళవారం సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఆరోగ్యకారణాల రీత్యా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత జైన్కు మంజూరైన బెయిల్ను సెప్టెంబర్ 25 వరకు పొడిగించారు.