బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ఢిల్లీకి బయలుదేరారు. హస్తినలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలను పురంధేశ్వరి కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలను ఢిల్లీ పెద్దలకు పురంధేశ్వరి వివరించనున్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం శనివారం దేశ రాజధానిలో జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఎర్రకోట నుంచి చేసిన ప్రకటనలను నెరవేర్చడంలో ప్రధాని బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట ప్రసంగంలో చేసిన ప్రకటనలను సమీక్షించేందుకు ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు.
అక్టోబర్ 13న జీ-20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు(P20 Summit)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో కెనడా కూడా పాల్గొననుంది. నిజానికి భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రెండు రోజులపాటు దేశ రాజధానిలో సీఎం పర్యటించనున్నారు. కాగా, ఇవాళ సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్తో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించారు. పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని ఆయన వినతి చేశారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్టు చేసింది.
నేపాల్లో రెండు భూకంపాలు సంభవించిన తర్వాత ఈరోజు ఢిల్లీలో భారీ ప్రకంపనలు సంభవించాయి. రియాక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది. ఢిల్లీతోపాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోని ఇతర ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించింది. నోయిడాలో 10 నుంచి 15 సెకన్ల పాటు భూకంపం సంభవించింది.
రాజధాని ఢిల్లీలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. మయూర్విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ టైలర్ 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన వద్దకు బట్టలు కొనేందుకు వచ్చిన బాలికపై ఈ అఘాయిత్యం చేశాడు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ISIS: ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. మోస్ట్ వాంటెండ్ అనుమానిత ఐసిస్ ఉగ్రవాది షానవాజ్ని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోమవారం తెలిపింది. తెల్లవారుజామున జైత్పూర్ లో షానవాజ్ని అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై ఎన్ఐఏ నగదును ప్రకటించింది. ఇద్దరిని మహ్మద్ రిజ్వాన్ అష్రాఫ్, మహ్మద్ అర్షద్ వార్సిగా గుర్తించారు. అష్రాఫ్ ని లక్నోలో అరెస్ట్ చేయగా.. అర్షద్ ని మొరాదాబాద్…