Delhi: ఓ మహిళతో తాను చేసిన వీడియో కాల్కు సంబంధించిన అశ్లీల స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించి వృద్ధుడి నుంచి రూ.12.8 లక్షలు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Road Accidents: ఇండియాలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం, చాలా సందర్భాల్లో రోడ్ల పరిస్థితులు సరిగా లేకపోవడం, ఓవర్ స్పీడ్, వాహనదారుల అజాగ్రత్త ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా రోడ్లను పట్టించుకోకపోవడం కూడా సమస్య తీవ్రతను పెంచుతోంది. తాజాగా రోడ్డు రవాణా మంత్రి శాఖ వెల్లడించిన నివేదికలో ఇండియా వ్యాప్తంగా 2022లో రోడ్డు ప్రమాదాలు పెరిగినట్లు తేలింది.
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం రాబోయే తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలపై ఢిల్లీ సహా ఎన్సీఆర్లోని ఐదు రాష్ట్రాల నుంచి అఫిడవిట్లను కోర్టు కోరింది.
Kerala Bomb Blast: కేరళలో వరస పేలుళ్ల తర్వాత దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలో హై అలర్ట్లో ఉన్నాయి. పేలుళ్ల నేపథ్యంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పండగ సీజన్, రాబోయే క్రికెట్ మ్యాచులన నిర్వహణ నేపథ్యంలో ముంబై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.
2023 ప్రపంచకప్లో ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ మ్యాచ్లో ఆసీస్ విధ్వంసం సృష్టించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.
తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బుధవారం స్పష్టత రానున్నట్లు బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.