Attack On Couple: దంపతులపై దుండగుల దాడి.. సాయం అడిగి చితకబాదారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack On Manipur Couple: దేశ రాజధానీ ఢిల్లీలో దారుణం జరిగింది. గుర్తు తెలియన కొందరు వ్యక్తులు మణిపూర్ దంపతులపై దాడి తెగబడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సాయం కావాలంటూ కోరి.. ఆపై వారిని చితకబాదిన ఘటన సౌత్‌ఈస్ట్ ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వారు ఎవరూ.. ఎందుకు దాడి చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై బాధితులు పోలిసులకు ఫిర్యాదు చేయగా.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. మణిపూర్‌కు చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో పాటు ఢిల్లీకి వలస వచ్చాడు.
సౌత్‌ఈస్ట్ ఢిల్లీలో కటుంబంతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడిని ఇంటికి విందుకు ఆహ్వానించాడు. రాత్రి కావడంతో అతడిని ఇంటి వద్ద దిగబెట్టేందుకు నడుచుకుంటూ వచ్చారు. అతడితో పాటు భార్య, చెల్లి కూడా ఉన్నారు. స్నేహితుడితో ఇంటి వద్ద దిగబెట్టిన అనంతరం తిరిగి నడుచుకుంటూ వెళుతుండగా.. వారి వద్దకు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చారు. తమ ఫోన్ డెడ్ అయ్యిందని.. క్యాబ్ బుక్ చేసుకునేందుకు సాయం చేయమని ఓ వ్యక్తి కోరారు. దీనికి మణిపూర్ వ్యక్తి అంగీకరించాడు కూడా. ఎందుకో తెలియదు అకారణంగా వారు అతడి భార్య చెల్లితో అభ్యంతరకరంగా వ్యవహరించారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
మహిళలు అని కూడా చూడకుండా వారితో దుర్భాషలాడారు. దీంతో తిరిగి వారు వాదిస్తున్న క్రమంతో మరికొందరు వారికి సాయంగా అక్కడికి వచ్చి మణిపూర్ కుటుంబంపై దాడికి తెగబడ్డారు. మహిళలనే కనికరం కూడా లేకుండా కింద పడేస్తు గుద్దుతూ.. చావబాదారు. ఈ ఘటన చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసి ఆ గుంపు పారిపోవడంతో.. తీవ్రంగా గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
📍Maharani Bagh New Delhi
📍Incident occurred in the jurisdiction of Sunlight Colony Police Station, New Delhi
📍On November 30, 2023 late at night unidentified group of people attacked a #Meitei family late at night when they were on their way home in Maharani Bagh, New… pic.twitter.com/2m6b7764m7
— MoonFace🌝💫⚡️✨ (@MoonFaceP) December 2, 2023
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?