ఢిల్లీలో ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు బయటకు వచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేసి ఇటుకతో కొట్టినట్లు సీసీటీవీ పుటేజీలో కనిపిస్తుంది.
Read Also: Tirumala Tour: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే తిరుమల టూర్
ఇక, సీసీటీవీ ఫుటేజీలో ముగ్గురు వ్యక్తులు నల్ల చొక్కా వేసుకుని ఉన్నారు.. వారు డెనిమ్ కలర్ డ్రెస్ వేసుకున్న వ్యక్తిని వెంబడించడం కనిపించింది.. వారిలో ఒకరి చేతిలో కత్తి ఉంది.. అయితే, చాలా దూరం పరిగెత్తిన వ్యక్తి నేలపై పడిపోయాడు దీంతో అతనిని వెంబడించిన ముగ్గురు సదరు వ్యక్తిని ఇటుకతో కొట్టి కత్తితో పొడిచారు. దీపిపై ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ (నార్త్ వెస్ట్) జితేంద్ర మీనా మాట్లాడుతూ.. ఈ విషయంలో తనకు ఇంకా అధికారికంగా ఫిర్యాదు అందలేదని చెప్పారు. దీనిపై విచారణ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. బాధితురాలిని గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్నామని వెల్లడించారు.