రెండో రోజు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. నిన్న (మంగళవారం) రాత్రి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఎంపీ మాణిక్కం ఠాగూర్ తో ఆయన సమావేశం అయ్యారు. అయితే, ఇవాళ ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ తో ఆయన భేటీ కానున్నారు. తెలంగాణ కేబినెట్ కూర్పుపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే రేపు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారమహాత్సవానికి వారిని రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అయితే, అంతకు ముందు నెలకొన్న ఉత్కంఠ వాతావరణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా వెల్లడించింది.
Read Also: BJP CM: తొందరేం లేదు.. మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. ఢిల్లీలో బీజేపీ మంథనాలు
సీఎం అధికారికంగా ప్రకటన పూర్తికావడంతో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం 10 గంటల 28 నిమిషాలకు రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక, సీఎంతో పాటు 9 నుంచి 18 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్ ఉంది. సాధారణ పరిపాలన శాఖ అధికారులతో కలిసి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ సహా పార్టీలోని సీనియర్ నేతలు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసి సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించి సమాచారం కూడా ఇచ్చారు. స్టేజీ ఏర్పాటుతో పాటు ఎక్కడెక్కడ ప్రవేశ ద్వారాలు ఉండాలి, ఎంత మందిని అనుమతించవచ్చు తదితర అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు.