Delhi: రక్తదానం చేయడం వల్ల అపాయకరస్థితిలో ఉన్న రోగులను కాపాడవచ్చు. అంతే కాదు రక్తదానం ఆరోగ్యానికి కూడా చాల మంచింది. అయితే మనలో చాల మంది రక్తదానం చెయ్యడానికి ఆసక్తి చూపరు. అలాంటి వారికి రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ రక్తదానం పైన అవగాహన కలిపించేందుకు ఓ వ్యక్తి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. వందకు పైగా రక్తదాన శిబిరాలను ఏర్పాడు చేసి వేల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వివరాలలోకి వెళ్తే.. డిల్లీకి చెందిన కిరణ్‌వర్మ అనే సామాజిక కార్యకర్త రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అనుకున్నారు. ఇందుకుగాను అతను పాదయాత్ర చేస్తూ ప్రజల్లో రక్తదానం పైన ఆవాహన కల్పించే సభలను ఏర్పాటు చేసాడు.
Read also:Suresh Kondeti: అవార్డ్స్ కోసం పిలిచి అవమానిస్తావా.. ఏకిపారేస్తున్న నెటిజన్స్
అలానే ఆ ప్రాంతంలో రక్తదాన శిబిరాలను ఏర్పాడు చేసి రక్తాన్ని సేకరించేవారు. ఆలా అతను 2021 డిసెంబరు 28వ తేదీన మొదటగా కేరళ లోని తిరువనంతపురం నుండి పాదయాత్రను ప్రారంభించారు. అలా పాదయాత్ర చేస్తూ ప్రస్థుతం నాగాలాండ్‌లోని కోహిమా జిల్లాకు చేరుకున్నారు. కాగా గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 229 జిల్లాల్లో పర్యటించిన ఆయన 17,700 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో దేశంలో 126 రక్తదాన శిబిరాలు నిర్వహించి 26,722 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ విషయం పైన కిరణ్‌వర్మ మాట్లాడుతూ.. తాను ఇప్పటికి 17,700 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని.. 2025 డిసెంబరు నెలాఖరుకు 21 వేల కి.మీ.ల పాదయాత్ర పూర్తి చేయాలన్నది తన లక్ష్యం అని తెలిపారు. కాగా 50 లక్షలమంది రక్తదాతలను ప్రోత్సహించడమే తన లక్ష్యమని.. ఈ నేపథ్యంలో పాదయాత్ర పూర్తయ్యేనాటికి దేశం లోని 10 కోట్ల మంది ప్రజలను కలుసుకుంటానని.. త్వరలో మణిపుర్, మిజోరం, త్రిపుర సహా ఈశాన్య ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు కిరణ్‌వర్మ పేర్కొన్నారు.