Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు మైనర్లు కలిసి ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. ఆ తర్వాత శవాన్ని ఎండు గడ్డితో కాల్చినట్లు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి ముగ్గురు టీనేజ్ నిందితులలో ఒకరిపై మృతుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతీకారంగానే నిందితులు ముగ్గురు, అతడినిపై ప్రతీకారం తీర్చుకునేందుకు హత్య చేశారు.
Read Also: Indian Navy : చైనాను వణికిస్తోన్న భారత్ కొత్త డిస్ట్రాయర్ యుద్ధనౌక
డిసెంబర్ 23 రాత్రి ఆగ్నేయ ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులు ముగ్గురూ 16-17 ఏళ్ల వయసు ఉన్నవారని పోలీస్ అధికారులు చెప్పారు. ముగ్గుర్ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిని కత్తితో పొడిచిన తర్వాత అతని శవాన్ని ఖుస్రో పార్క్ సమీపంలో కాల్చేందుకు ప్రయత్నించారు. నిందితుల్ని నిజాముద్దీన్ బస్తీ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు.
బాధిత వ్యక్తిని తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారని, పార్కు సమీపంలో సగం కాలిన మృతదేహం కనిపించిందని అధికారులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, రాళ్లు, కర్రల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు హజ్రత్ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాడు. మృతుడు ఆ ఏరియాలో చాలా చెడ్డ వ్యక్తిగా తేలింది. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తి నిందితుల్లో ఒకరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అతనే ఈ హత్యకు పథకం రచించాడని పోలీసులు వెల్లడించారు.