ఢిల్లీ ఎయిమ్స్‌లో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. టీచింగ్ బ్లాక్‌లో ఇవాళ తెల్లవారుజామున ఎయిమ్స్ ఆస్పత్రిలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి.. అగ్ని ప్రమాదంలో ఫర్నీచర్, ఆఫీసు రికార్డులు దగ్ధం అయ్యాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ప్రమాదం జరిగినట్లు సమాచారం వచ్చిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది 7 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
#WATCH | A fire broke out in the Teaching Block of AIIMS Delhi today, which led to damage to furniture and office records; no casualty was reported, says Delhi Fire Services
(Video source: Delhi Fire Services) pic.twitter.com/UmCYs7tXkQ
— ANI (@ANI) January 4, 2024