YS Sharmila: నేడు జగన్ ఇంటికి షర్మిల.. ఆ తర్వాత ఢిల్లీకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇంట ఈ రోజు ఆసక్తికర పరిణామాలు జరగబోతున్నాయి.. కుటుంబ సమేతంగా సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లనున్న షర్మిల.. తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవనున్నారు.. తన కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరితో వివాహ నిశ్చితార్థంతో పాటు పెళ్లి వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను జగన్‌కు అందజేయనున్నారు.. తన ఇంట్లో జరిగే తొలి శుభకార్యానికి హాజరుకావాలని అన్నకు ఆహ్వానం పలకనున్నారు.. అయితే, గత కొన్నేళ్లుగా అన్నా – చెల్లెళ్ళ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుందనే వార్తలు వచ్చాయి.. చివరకు వైఎస్ ఘాట్‌లో నివాళులర్పించే సమయంలోనూ ఇద్దరు విడివిడిగా వెళ్లడం కూడా హాట్ టాపిక్ అయ్యింది.. ఇప్పుడు షర్మిల.. తన అన్నయ్య దగ్గరకు వెళ్తుండడంతో.. ఈ పరిణామాలను ఆసక్తికరంగా గమనిస్తున్నారు ప్రజలు.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
మరోవైపు.. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిల.. తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో సమావేశం అయిన తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు.. రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో సమావేశమై.. కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.. అయితే, కాంగ్రెస్‌లో చేరేముందు వైఎస్ జగన్‌ను కలవనుండడం కూడా చర్చగా మారింది.. ప్రస్తుతం ఇడుపులపాయలో ఉన్న వైఎస్ షర్మిల.. కడప నుంచి ప్రత్యేక విమానంలో తన కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి చేరుకుంటారు.. మరోవైపు.. తన కాకినాడ పర్యటనను ముగించుకుని మధ్యాహ్నం తర్వాత నివాసానికి చేరుకుంటారు వైఎస్ జగన్.. ఆ తర్వాత అన్నను కలిసి ఆహ్వానం అందించి ఢిల్లీ బాట పట్టనున్నారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ అగ్రనేతలతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. తన వెంట వచ్చే నేతల వివరాలు.. తనకు బాధ్యతలు అప్పగిస్తే తాను నిర్వహించే కార్యక్రమాలు.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్‌టీపీ విలీనం.. తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అయితే, ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపిన షర్మిలకు ఓ క్లారిటీ వచ్చిన తర్వాతే పార్టీ విలీనానికి సిద్ధమైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తు్నారు. ఇక, ఏపీ కాంగ్రెస్ లో ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించే ఆలోచన హైకమాండ్ చేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత ఏర్పడింది.. మరోవైపు.. రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని ప్రకటించిన షర్మిల.. ఢిల్లీలో ఏం మాట్లాడనున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!