కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు షర్మిల అన్నారు. రేపే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని ఉద్దేశంతోనే తెలంగాణలో పోటీ చేయలేదని షర్మిల చెప్పారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో తమ మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. తెలంగాణలో 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము పోటీ పెట్టకపోవడమే ప్రధాన కారణమని షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్ అరాచక పాలనను అంతమొందించేందుకు తన వంతు కృషి చేశానని తెలిపింది. రెండు రోజుల్లో అన్ని విషయాలు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అయితే ఖాయమని చెప్పారు. తన కుమారుడి వివాహం సందర్భంగా తండ్రి ఆశీస్సులు తీసుకోవడానికి పులివెందులకు వచ్చానని తెలిపారు.
Read Also: Fact-Check: ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ చనిపోయాడా..? నిజం ఇదే..
కాంగ్రెస్ లో చేరిన తర్వాత వైఎస్ షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు రాహుల్ గాంధీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏఐసీసీ, సీడబ్ల్యూసీలో ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఈ నెల 4న ఎల్లుండి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు విశ్వనీయ సమాచారం. ఆ తర్వాత కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి షర్మిలకు కూడా 4వ తేదీన ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానం అందింది.
Read Also: Anil Kumar: అనిల్ వర్సెస్ నారాయణ.. కాక పుట్టిస్తున్న నెల్లూరు రాజకీయం