Traffic Jam At Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఒక వైపు అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, మరో వైపు బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పాడింది. చండీగఢ్‌లో జరిగిన మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ ప్రధాన కార్యాలయం వెలుపల ఆప్ నిరసన తెలుపుతుంది. అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఆప్ ప్రధాన కార్యాలయం దగ్గర భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిరసన తెలియజేస్తున్నారు. రెండు పార్టీల ప్రధాన కార్యాలయం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో ఉంది. ఈ రెండు పార్టీ ఆఫీసుల దగ్గర పటిష్ట ఏర్పాట్లు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.
Read Also: Rakul Preet Singh : రెడ్ కలర్ డ్రెస్సులో హాట్ మిర్చీలా రకుల్ స్టన్నింగ్ పోజులు..
దీంతో ఢిల్లీలో ఆప్, బీజేపీల ప్రదర్శన కారణంగా సెంట్రల్ ఢిల్లీతో పాటు రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నిరసనలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు బారికేడ్లు వేసి పలు రహదారులను మూసి వేశారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. డీఎన్‌డిలో కూడా భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో రింగురోడ్డుపై వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇక, రింగ్ రోడ్డులో రెండు చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ సౌత్ వెస్ట్ ఏసీపీ తెలిపారు. ట్రాఫిక్ కు నియంత్రించేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే అదనపు సిబ్బందిని నియమించారు.
Read Also: Kishan Reddy: గ్రూప్-1 నోటిఫికేషన్ ఎప్పుడు?.. ప్రభుత్వానికి కిషన్ రెడ్డి ప్రశ్న?
అయితే, మంగళవారం నాడు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ విజయంతో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టి షాక్ తగిలింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రాంవీర్ సింగ్ బిధూరి తదితరులు నిరసన తెలియజేస్తున్నారు.