లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ (ఈడీ) ఐదో సారి నోటీసులు జారీ చేసింది. అయితే, ఇవాళ విచారణకు హాజరుకావలంటూ కేజ్రీవాల్ కి ఈడీ నోటీసులు ఇచ్చింది. కేజ్రీవాల్ ఈడీ విచారణ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇంతకీ విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపై తీవ్ర ఉఠ్కంత నెలకొంది. గతంలో 4 సార్లు ఈడీ నోటీసులు ఇవ్వగా విచారణకు హాజరుకానీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఎన్నికల ప్రచారం, విపాసన ధ్యాన ప్రక్రియ పేరుతో మరోసారి, మూడోసారి సమన్లను పట్టించుకోకుండా.. ఇక, నాలుగోసారి ముందస్తు ఫిక్స్ అయిన ప్రోగ్రాం ఉన్నందున విచారణకు హాజరుకాలేనంటూ ఈడీకి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
Read Also: Kaatera : కాటేరా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ
అయితే, ఈరోజు ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుటకు హాజరు కానని మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమాధానం ఇచ్చారు. ఇటీవలే తన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించింది.. తనను జైల్లో వేస్తామని వారితో చెప్పిందని ఆయన చేసిన ఆరోపణలతో ఈరోజు ఏం జరుగుతుందన్న టెన్షన్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో నెలకొంది. ఇక, ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం.. మరోసారి ఆయన హాజరుకావడం లేదని స్పందించడంపై ఈడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో అనేది వేచి చూడాలి.