Delhi: పాక్-సౌదీ రక్షణ ఒప్పందంపై స్పందించిన భారత్
- పాక్-సౌదీ రక్షణ ఒప్పందంపై భారత్ కీలక వ్యాఖ్యలు
- ఒప్పందంపై అధ్యయనం చేస్తున్నట్లుగా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సౌదీ అరేబియాలో పర్యటించారు. ఇక రియాద్‌లో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. పరస్పరం రక్షణ ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం.. ఏ దేశంపైనైనా దాడి జరిగితే.. రెండు దేశాల మధ్య జరిగిన దురాక్రమణగా పరిగణించబడుతుందని ప్రకటించాయి. అప్పుడు రెండు దేశాలు కలిసి.. శత్రువుపై దాడి చేయడమే ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఒప్పందం సందర్భంగా దిగిన ఫొటోలో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా ఉన్నాడు.
ఇది కూడా చదవండి: Punjab: 75 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడ్డ 71 ఏళ్ల వృద్ధురాలు.. అమెరికా నుంచి భారత్‌కు వచ్చి చివరికిలా..!
Also Read
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
తాజాగా పాక్-సౌదీ రక్షణ ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఒప్పందంపై అధ్యయనం చేస్తున్నట్లుగా ప్రకటించింది. జాతీయ ప్రయోజనాలు కాపాడటానికి, అన్ని రంగాల్లో సమగ్ర జాతీయ భద్రత కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మీడియా ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరు దేశాల ఒప్పందాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Charlie Kirk: చార్లీ కిర్క్ హత్యపై జిమ్మీ కిమ్మెల్ ఎగతాళి.. లైవ్‌షో బహిష్కరిస్తున్నట్లు నెక్స్‌స్టార్ ప్రకటన
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ బుధవారం రియాద్‌ను సందర్శించారు. రియాద్‌లోని అల్-యమామా ప్యాలెస్‌లో షరీఫ్‌ను సౌదీ యువరాజు కలిశారు. రెండు దేశాల మధ్య చారిత్రాత్మక, వ్యూహాత్మక సంబంధాలు సమీక్షించినట్లు పేర్కొన్నాయి. ఈ రెండు దేశాల మధ్య దాదాపు 8 దశాబ్దాలుగా చారిత్రాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. తాజా ఒప్పందం.. సోదరభావం.. ఇస్లామిక్ సంఘీభావం, అలాగే భాగస్వామ్య వ్యూహాత్మకం, రక్షణ సహకారానికి ఆధారపడి ఉందని ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్-సౌదీ రక్షణ ఒప్పందం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. పైగా ఒక దేశంపై దాడి చేస్తే.. రెండు దేశాలపై దాడి చేసినట్లుగా భావించి.. రెండు దేశాల కలిసి శత్రువుపై దాడి చేయాలనేది కొత్త ఒప్పందం యొక్క ఉద్దేశం.
వాస్తవంగా భారత్-సౌదీ మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య రియాద్‌లో ద్వైపాక్షిక సంబంధాలు కూడా జరిగాయి. మోడీ మూడు సార్లు సౌదీకి వెళ్లారు. 2016లో సౌదీ అరేబియా అత్యున్నత పౌర పురస్కారం అయిన కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్‌ను మోడీకి ప్రదానం చేశారు. భారతదేశం ఇప్పుడు సౌదీకి రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా ఉంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రధాని మోడీ రియాద్ పర్యటన సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిని సౌదీ ఖండించింది. ఏ కారణం చేతనైనా ఉగ్ర దాడిని సమర్థించేది లేదని సౌదీ ప్రకటించింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని కూడా సౌదీ ఖండించింది. కానీ తాజాగా పాక్‌తో రక్షణ ఒప్పందం చేసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో..!
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!