Rashmika Mandanna: నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. జరా పటేల్ అనే ఒక బ్రిటిష్-ఇండియన్ ఇన్ఫ్లూయెన్సర్ నల్లటి దుస్తులు ధరించి లిఫ్టులోకి ప్రవేశించే వీడియోలో డీప్‌ఫేక్ వీడియోలో రష్మికా ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. ఈ వీడియోపై చిత్రపరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌తో సహా చిత్ర పరిశ్రమ రష్మికకు మద్దతుగా…
Rashmika Mandanna: ఒకదాని వెనుక ఒకటి హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కేసులో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Delhi: ఢిల్లీలో ఓ స్కూల్ క్యాబ్ డ్రైవర్ అదే స్కూల్లో చదువుతున్న 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఢిల్లీలోని సంసద్ మార్గ్ లోని ప్రముఖ పాఠశాలలో చదువుతోంది. నవంబర్ 3న బాలిక పాఠశాలకు హాజరుకాలేదు. ఈ విషయం గురించి పాఠశాల యాజమాన్యం నుంచి బాలిక తండ్రికి సమాచారం అందింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Delhi Police: దేశ రాజధానిలో ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్‌ను ఓ కారు ఢీకొట్టిన సీసీటీవీ ఫుటేజీలు బయటపడ్డాయి. కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
Swiss Woman Murder: ఢిల్లీలో ఇటీవల స్విట్జర్లాండ్ మహిళ దారుణ హత్యకు గురైంది. తిలక్ నగర్లో 30 ఏళ్ల నినా బెర్గర్ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. గురుప్రత్ సింగ్ అనే వ్యక్తి సదరు మహిళతో రిలేషన కలిగి ఉన్నట్లు పోలీసులు వచ్చారు. స్విట్జర్లాండ్ లో ఉంటున్న మహిళను ప్లాన్ ప్రకారం ఇండియాకు వచ్చే విధంగా చేసి హత్య చేశాడు.
Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 55 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆపై ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల వింత విచారణ వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో 'లైంగిక దోపిడీ' అనే పదం ఎక్కడా ప్రస్తావించబడలేదు.
Delhi: ఢిల్లీలో దారుణం జరిగింది. దొంగతనాన్ని అడ్డుకోబోయిన క్యాబ్ డ్రైవర్ని అత్యంత ఘోరంగా కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన ఢిల్లీలో మహిపాల్పూర్ ప్రాంతంలో జరిగింది. 43 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ బిజేంద్ర ఈ ఘటనలో తీవ్రగాయాలపాలై మరణించారు.
Israel Hamas War: మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఆన్లైన్ పోర్టల్ న్యూస్‌క్లిక్ చైనా నుంచి నిధులు తీసుకుని దానికి అనుకూలంగా వార్తలు రాస్తున్నారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.