Rashmika Mandanna : రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురు అరెస్ట్.. ఆ ఒక్కరి కోసం వేట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల సినీ తారల డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అవి సోషల్ మీడియాలో ఎంత దుమారం రేపాయో తెలిసిందే.. నిందితులు మొదట నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను టార్గెట్ చేశారు. మొన్నటి వరకు ఆమెకు సంబంధించిన బ్లాక్ డ్రెస్ డీప్ ఫేక్ వీడియో నెట్టింట వీడియో చక్కర్లు కొట్టింది.. ఆ తర్వాత పలు ప్రముఖ హీరోయిన్ల వీడియోలను కూడా రిలీజ్ చేశారు.. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.. నిందితులను వెంటనే పట్టుకోవాలని అధికారులను ఆదేశించింది..
ఏఐ సాయంతో రష్మిక మందన్న ముఖాన్ని మార్ఫింగ్ చేసి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై రష్మికతో పాటు సినీ పరిశ్రమలోని ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్ సీరియస్ అయ్యారు. రష్మిక తర్వాత అలియా భట్, కత్రీనా కైఫ్, ప్రియాంక చోప్రా స్టార్ హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోస్ సైతం వైరలయ్యాయి. అయితే ఈ వీడియోస్ అన్ని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సాయంతో చేసినట్లు గుర్తించారు. టెక్నాలజీ సాయంతో డీప్ ఫేక్ వీడియోస్ చేయడంపై అమితాబ్ బచ్చన్ సైతం అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోస్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు, ప్రముఖులు డిమాండ్ చేశారు..
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
- India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
రష్మిక డీప్ ఫేక్ వీడియో ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఆ నలుగురు ఈ వీడియోను అప్‌లోడ్ చేసినట్టు గుర్తించారు.. అయితే అసలు కుట్రదారుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ యానిమల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇక ప్రస్తుతం తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది. అటు లతో బిజీగా ఉంటూనే.. ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రష్మిక. ప్రస్తుతం రష్మిక పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్ ల్లో నటిస్తుంది..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!