రైతులు చేస్తున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు దేశ రాజధాని పోలీసులు భారీ ప్లాన్ కు సిద్ధం అయ్యారు. పంజాబీ రైతుల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సుమారు 30 వేల టియర్ గ్యాస్ షెల్స్‌ను ఆర్డర్ పెట్టినట్లు తెలుస్తుంది.
Farmers Protest : తమ వివిధ డిమాండ్ల కోసం ఢిల్లీకి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్న రైతులకు సంబంధించి పలు ఇంటెలిజెన్స్ సమాచారం వెలుగులోకి రావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
Terrorist arrest: ఆర్మీలో పనిచేసిన జవాన్ లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారాడు. అతడిని ఢిల్లీ పోలీసులు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. రిటైర్డ్ ఆర్మీ సైనికుడు రియాజ్ అహ్మద్ గత కొంత కాలంగా లష్కర్ ఉగ్రవాదిగా పనిచేస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు కుప్వారా జిల్లాలోని ఎల్ఈటీ మాడ్యుల్ చేధించిన కొద్ది రోజుల తర్వాత ఈ అరెస్ట్ చోటు చేసుకుంది.
క్రైమ్ బ్రాంచ్ నోటీసు విషయంలో అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తన ఇంటి ముందు 5 గంటల పాటు క్రైం బ్రాంచ్ అధికారులు డ్రామా ఆడేలా చేసింది బీజేపీ.. అతీషి ఇంటి ముందు 5 గంటల పాటు డ్రామా సాగిందని కేజ్రీవాల్ తెలిపారు. క్రైం బ్రాంచ్ అధికారులు తీసుకొచ్చిన నోటీసులో ఎలాంటి ఎఫ్ఐఆర్ ప్రస్తావన లేదని, ఇప్పటికీ నోటీసుకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చామని తెలిపారు. అయితే ఇలాంటి డ్రామాలు దేశ ప్రగతికి…
Delhi Crime: సోషల్ మీడియా పరిచయాలు కొంపలు ముంచుతున్నాయి. యువతులను టార్గెట్ చేస్తూ కొందరు వల విసురుతున్నారు. దీంట్లో ట్రాప్ అయిన తర్వాత కానీ తాము ఎంత పెద్ద తప్పు చేశామో తెలియడం లేదు వారికి. సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ పేరిట పరిచయం పెంచుకుని, ఆ తర్వాత పార్టీలకు, పబ్బులకు ఆహ్వానించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నాయి.
ఢిల్లీ హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయం తీసుకున్నారు. AI వినియోగం బాధితుడిని గుర్తించడంలో సహాయపడటమే కాకుండా హత్యకు కారణమైన ప్రధాన నిందితుడిని అరెస్టు చేసేందుకు హెల్ప్ చేసింది.
Fake Passport and Visa: పదేళ్ల తర్వాత తెలంగాణలో తొలిసారిగా సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. నకిలీ వీసా పాస్‌పోర్టులు జారీ చేస్తున్న ముఠాను సీఐడీ అధికారులు పట్టుకున్నారు.
Rashmika Mandanna deepfake: నటి రష్మికా మందన్నా డీప్‌ఫేక్ వీడియో గతేడాది సంచలనంగా మారింది. బ్రిటిష్ ఇన్ఫ్లూయెన్సర్ జరా పటేల్ వీడియోకి రష్మికా ముఖాన్ని మార్ఫింగ్ చేసి రూపొందించిన ఈ వీడియోపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ దుర్వినియోగంపై కేంద్రం మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ వీడియో మార్ఫింగ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాజాగా ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Rashmika Mandanna: నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా వివాదం సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), డీప్‌ఫేక్ టెక్నాలజీని దుర్వినియోగం చేయడం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కఠిన చట్టాలు తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఐటీ చట్టంలో కఠిన నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు.