దేశంలో కరోనా కేసుల తీవ్ర భయం కలిగిస్తోంది.ఢిల్లీలో 22 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదల ఢిల్లీ వాసుల్ని కలవరపెడుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 1000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన వారిలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఢిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ చిన్మయ్ బిశ్వాల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వైరస్ నిర్ధరణ అయినవారంతా ప్రస్తుతం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. దేశంలో 4,033 చేరిన ఒమిక్రాన్…
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం, మృతుల సంఖ్య కూడా భారీగా ఉండడంతో.. అప్రమత్తమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. లాక్‌డౌన్ ప్రకటించారు.. కేసులు అదుపులోకి రాకపోవడంతో క్రమంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వచ్చారు. అక్కడ లాక్‌డౌన్ మంచి ఫలితాలను ఇచ్చింది.. ఇప్పుడు కరోనా పాజిటివిటీ రేటు 1.5 శాతానికి పడిపోయింది.. దీంతో.. ఈ నెల 31వ తేదీ నుంచి దశలవారీగా అన్‌లాక్‌కు వెళ్లనున్నట్టు వెల్లడించారు…
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో లాక్‌డౌన్ విధిస్తూ ఆ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. తాజాగా మరో వారం రోజుల పాటు ఢిల్లీలో లాక్‌డౌన్ ను పొడిగిస్తున్నట్టుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేడు నిర్ణయం తీసుకొన్నారు. దీంతో ఈ నెల 24 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. ఢిల్లీలో లాక్‌డౌన్ కు ముందు కేసుల తీవ్రత ఎక్కువగా ఉండగా.. లాక్ డౌన్ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే…
దేశరాజధాని ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ పొడిగించారు.. ఇప్పటికే రెండో విడతలగా లాక్‌డౌన్ విధించినా.. కోవిడ్ కంట్రోల్ కావడం లేదు.. దీంతో.. మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ ఉంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కాగా, ఢిల్లీలో తాజాగా 27,000 కొత్త కేసులు నమోదు కాగా.. 375 మంది మృతిచెందారు.. ఇలా వరుసగా 13వ రోజు 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. మరోవారం…