దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో లాక్‌డౌన్ విధిస్తూ ఆ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. తాజాగా మరో వారం రోజుల పాటు ఢిల్లీలో లాక్‌డౌన్ ను పొడిగిస్తున్నట్టుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేడు నిర్ణయం తీసుకొన్నారు. దీంతో ఈ నెల 24 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. ఢిల్లీలో లాక్‌డౌన్ కు ముందు కేసుల తీవ్రత ఎక్కువగా ఉండగా.. లాక్ డౌన్ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే పూర్తిస్థాయి కంట్రోల్ అయ్యే వరకు మరోవారం రోజులు లాక్ డౌన్ విధించడమే సరైన నిర్ణయంగా ఢిల్లీ ప్రభుత్వం భావించింది.