కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం, మృతుల సంఖ్య కూడా భారీగా ఉండడంతో.. అప్రమత్తమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. లాక్‌డౌన్ ప్రకటించారు.. కేసులు అదుపులోకి రాకపోవడంతో క్రమంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వచ్చారు. అక్కడ లాక్‌డౌన్ మంచి ఫలితాలను ఇచ్చింది.. ఇప్పుడు కరోనా పాజిటివిటీ రేటు 1.5 శాతానికి పడిపోయింది.. దీంతో.. ఈ నెల 31వ తేదీ నుంచి దశలవారీగా అన్‌లాక్‌కు వెళ్లనున్నట్టు వెల్లడించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్… కోవిడ్ బారినపడకుండా కాపాడటంతో పాటు వారు ప్రజలు ఆకలితో చనిపోయే పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కూడా సర్కార్‌పై ఉందని.. అందుకే 31వ తేదీ నుంచి దశలవారీగా నిబంధనలు సడలిస్తామని వెల్లడించారు. కార్మికులు, వలస కూలీల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని నిర్మాణ కార్యకలాపాలను అనుమతించడంతో పాటు ఫ్యాక్టరీలు తిరిగి తమ కార్యకలాపాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని.. మహమ్మారిపై పోరు మాత్రం ముగిసిపోలేదన్నారు.