CBI searched Delhi Deputy CM's bank lockers: ఢిల్లీ మద్యం స్కామ్ లో సీబీఐ దూకుడు పెంచింది. ఏ1 నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన లాకర్లను మంగళవారం పరిశీలించారు సీబీఐ అధికారులు. దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లోని ఘజియాబాద్ సెక్టార్ 4లో ఉన్న పీఎన్బీ బ్యాంచ్ లో ఐదుగురు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాలపై మనీష్ సిసోడియా స్పందించారు. సీబీఐ అధికారుల దాడుల్లో ఏమీ దొరకలేదని ఆయన…
Delhi Assembly special session: ఢిల్లీ అసెంబ్లీ ఒక రోజు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ సమావేశం అయింది. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయం నేపథ్యంలో, ఎమ్మెల్యేల కొనుగోలు విమర్శల నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. బుధవారం ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ రూ.800 కోట్లను సిద్ధం చేసిందని
GVL Narasimha Rao: తెలుగు రాష్ట్రాలలో స్కాంలు జరుగుతున్నాయని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తున్నాయని.. ఈ స్కాం ద్వారా అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూరిందనే ప్రచారం జరుగుతోందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. గ్రేట్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలన్నారు. అటు ఏపీలో లేపాక్షి భూముల వ్యవహారం పెద్ద ల్యాండ్…