Jagadish Reddy: బీజేపీ ఎజెండా ఇదే.. అందుకే ఈ కుట్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRS Minister Jagadish Reddy Fires On BJP Over Kavitha Scam Issue: తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించి.. అభివృద్ధికి నిలువరించాలన్నదే బీజేపీ ఎజెండా అని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. కావాలనే ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ క్యాడర్‌ను రెచ్చగొట్టాలన్నదే బీజేపీ వ్యూహమని, ప్రతీకార దాడులు జరిపించుకోవాలన్నదే ఆ పార్టీ పథకమని అన్నారు. ప్రతీకార దాడులు చేయించుకొని, దాన్ని సింపతీగా వాడుకోవాలని బీజేపీ చూస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోపణలు చేసేది వారే, దాడులకు దిగేది వారేనని ఆగ్రహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత హస్తం ఉందని చట్టబద్ద సంస్థలు ఎక్కడా ప్రకటించలేదని, ఇదంతా బీజేపీ ఎంపీ (పర్వేశ్ శర్మ) సృష్టించిన రాద్ధాంతమని ఫైరయ్యారు.
కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని.. బీజేపీ నాటకం ఆడుతోందని జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అలజడికి బీజేపీ కుట్ర పన్నుతోందని.. రాష్ట్ర ప్రభుత్వం చేపబడుతోన్న అభివృద్ధి కార్యక్రమాల్ని నిలువరించి, పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన వ్యవహారం కూడా ఒక డ్రామానే అని వెల్లడించారు. భౌతిక దాడులకు టీఆర్ఎస్ దిగితే.. బీజేపీ అడ్రస్ గల్లంతు అవుతుందని తీవ్రంగా హెచ్చరించారు. అయితే.. సీఎం కేసీఆర్ ఆలోచన అది కాదని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. బీజేపీ పన్నుతున్న కుట్రల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు.
Also Read
- కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
- Raids: మాదాపూర్‌లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
- Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్‌పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
- Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
-
కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
-
Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
-
Krishna Janmashtami 2026: జన్మాష్టమి పూజలో ఈ 5 వస్తువులను సమర్పించండి.. అన్నీ శుభ ఫలితాలే..
-
Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!