Supreme Court: రాహుల్ గాంధీకి పరువునష్టం కేసులో రెండు ఏళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత రాజకీయం మారుతోంది. తాజాగా శుక్రవారం 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ అత్యున్నత న్యాయస్థానం తలుపుతట్టారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), ఐటీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సిసోడియా తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఢిల్లీ ప్రభుత్వ ‘ఫీడ్బ్యాక్ యూనిట్’లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం తాజా కేసు నమోదు చేసింది.
ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరవుతుంది అనే చివరి నిమిషంలో అందరూ షాక్ అయ్యేలా ఈడీకి కవిత లేఖ రాసింది. నేను రాను రాలేనంటూ ఈడీకి లేఖ రాసారు ఎమ్మెల్సీ కవిత.