Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఒకేరోజులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్కామ్‌లోని ప్రధాన నిందితుల్లో ఒకరైన శరత్ చంద్రారెడ్డికి భారీ ఊరట లభించింది. రౌస్ ఎవెన్యూ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. శరత్ చంద్రారెడ్డి భార్య కనికారెడ్డి అనారోగ్య పరిస్థితి దృష్ట్యా.. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఇప్పుడు దాన్ని పూర్తిస్థాయి బెయిల్‌గా మార్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ…
ల్లీ లిక్కర్ స్కాం విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన దూకుడును పెంచింది. ఈ కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్నవారిని విచారిస్తూ తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తోంది. కాగా ఈ కేసులో తాజాగా ఈడీ పొరపాటు చేయడం సంచలనంగా మారుతోంది. ఈడీ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్‌లో ఒకరి పేరుకు బదులుగా మరొకరి పేరును మార్చడం వల్ల గందరగోళంగా మారింది.
మనీష్ సిసోడియాకు సీబీఐ షార్ ఇచ్చింది. అందులో నిందితుడిగా మనీష్ సిసోడియాను చేర్చింది. ఛార్జ్ షీట్ లోకి మనీష్ సిసోడియా పేరు ఎక్కడం ఇదే తొలిసారి. ఆయనతో పాటు గోరంట్ల బుచ్చిబాబు పేరును కూడా సీబీఐ తాజాగా ఛార్జ్ షీట్ లోకి చేర్చనుంది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ విచారణ ముగిసింది. దాదాపుగా 9 గంటల పాటు సీబీఐ ప్రశ్నించింది. సీఆర్పీసీ 161 కింద లిక్కర్ స్కామ్ పై సీఎం కేజ్రీవాల్ స్టేట్మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డ్ చేసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెబుతానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి.. దాచిపెట్టేందుకు ఏమీ లేదని కేజ్రీవాల్ అన్నారు. తన అరెస్ట్‌కు బీజేపీ ఆదేశాలు ఇచ్చిందని, సీబీఐ వాటిని తప్పక పాటిస్తుందని ఆరోపించారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎంకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సమన్లు జారీ చేయడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ముఖ్యమంత్రికి సమన్లు జారీ అయిన తర్వాత పలు విపక్షాలు ఆయనకు మద్దతుగా నిలబడుతున్నాయి. ఇదిలా ఉంటే సీబీఐ సమన్ల నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చాడు. సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది.
Nitish Kumar: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రతిపక్షాల నుంచి ఆయనకు మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు పలు ప్రతిపక్ష నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా కేజ్రీవాల్ కు అండగా నిలిచారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఏప్రిల్ 16న విచారణకు రావాలని సీబీఐ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు పలువురు ప్రముఖులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.