ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. మద్యం కుంభకోణంలో తనను ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేశారు ఎమ్మెల్సీ కవిత. breaking news, latest news, telugu news, mlc kavitha, delhi liquor scam
Supreme vs ED: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈడీ అధికారాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ఈ నెల 26కి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా నోటీసులు ఎలా ఇస్తారని కవిత ఈ పిటిషన్ వేశారు.
MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేడు విచారణకు హాజరుకావాలని నోటీసులకు ఎమ్మెల్సీ కవిత సెటైరికల్ రెస్పాన్స్ ఇచ్చారు.
Once again ED notices for Mmelsi Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు (సెప్టెంబర్ 15) విచారణకు హాజరు కావాలని తాజాగా సమన్లు జారీ చేసింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విడివిడిగా విచారిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.
గతంలో రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు ఈరోజు తిరస్కరించింది.
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలో కొత్త పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం, కేజ్రీవాల్ కు అత్యంత ఆప్తుడిగా పేరొందిన మనీష్ సిసోడియాను గురించి తలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. గత ఫిబ్రవరి నెల నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని మద్యం పాలసీలో జరిగిన కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు ఈరోజు బెయిల్ నిరాకరించింది.