Nepal: నేపాల్‌లో కూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్
- నేపాల్‌లో కూలిన హెలికాప్టర్
- మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఘటన
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్‌లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. మృతదేహంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కాట్మాండు నుంచి ఒక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు హెలికాప్టర్‌లో తరలిస్తున్నారు. ఖోటాంగ్ జిల్లా కెపిలాస్‌గఢిలో హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగా ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్‌కు స్వల్ప గాయాలు కాగా.. ఇతరులకు ఎలాంటి నష్టం జరగనట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో ఎవరూ మరణించలేదని జిల్లా మేజిస్ట్రేట్ రేఖా కండెల్ మీడియాకు తెలిపారు.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ఇది కూడా చదవండి: Iran Execution: ఇజ్రాయెల్ గూఢచారికి ఇరాన్ గడ్డపై ఉరిశిక్ష
ప్రత్యేక మిషన్‌లో భాగంగా హెలికాప్టర్ మృతదేహాన్ని కాట్మాండు నుంచి ఖోటాంగ్‌కు తరలిస్తోంది. రోడ్డు, విమానాశ్రయ సౌకర్యాలు పరిమితంగా ఉండే నేపాల్ పర్వత ప్రాంతంలో ఇలాంటి ప్రయాణాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే హెలికాప్టర్‌లో మృతదేహాన్ని తీసుకొస్తుండగా ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్‌ను నడపడం అత్యంత ప్రమాదకరం. ఇరుకైన లోయలు, ఆకస్మిక వాతావరణ మార్పులు, తాత్కాలిక ల్యాండింగ్ ప్రదేశాలు పైలట్లకు తీవ్రమైన సవాళ్లను విసురుతాయి. ఈ కారణంగానే నేపాల్‌లో హెలికాప్టర్ ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి.
అయితే తాజా ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ప్రస్తుతం తెలియరాలేదని అధికారులు అన్నారు. ఈ ప్రమాదం సాంకేతిక లోపమా? లేదంటే పైలట్ తప్పిదమా? లేదంటే వాతావరణం కారణమా? అనే విషయాలపై అధికారులు దర్యాప్తు చేయనున్నారు. సహాయక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను పరిశీలించారు. ప్రమాదం తీవ్రమైనదే అయినప్పటికీ ఎవరూ చనిపోకపోవడంతో ఊరట లభించింది.
🚨DRAMATIC VIDEO OF HELICOPTER CRASH IN NEPAL
A helicopter crashed in Khotang District of Nepal, while landing in the farmland.
The helicopter was carrying a body and had flown in from Kathmandu. No human casualties has been recorded. #nepal #planecrash #breaking pic.twitter.com/IxTQ3pJSA4
— Chaudhary Parvez (@ChaudharyParvez) March 18, 2026
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!