విచారణకు సంబంధించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఆయన అభ్యర్థన మేరకు తెలంగాణ మహిళా కమిషన్ విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఎక్సైజ్ పాలసీని ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ సర్కారు ప్రకటించింది. పాత ఎక్సైజ్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం 6 నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ ఈడీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కవితకు మద్దతుగా ఢిల్లీల్లో ఫ్లెక్సీలు, హోర్డింగులు వెలిశాయి.