దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కవిత ఈడీ అధికారుల ముందు హాజరవుతారు.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్పులో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదుతో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చాయి. మొదట సీబీఐ, తర్వాత ఈడీ రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నాయి. తొలిరోజుల్లో ఢిల్లీ సర్కారును షేక్ చేసిన లిక్కర్ స్కామ్.. తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన అరుణ్ రామచంద్రపిళ్లై కవితకు బినామీ అని వాంగ్మూలమిచ్చారని ఈడీ చెప్పింది. అయితే ఉన్నట్టుండి పిళ్లై…
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలు గుప్పిస్తోంది. ఆప్ నాయకులు బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేంద్రాన్ని రాక్షస రాజు హిరణ్యకశిపుడితో పోల్చారు. పరోక్షంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుపించారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. కొంతమంది తమను తాము హిరణ్య కశ్యపుడిలా భావించుకుంటూ తమను తాము దేవుడిలా…
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకు మరో షాక్ తగిలింది. సీబీఐ అరెస్ట్ చేసిన అనంతరం బెయిల్ మంజూరు కాకముందే మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల వెనుక బిజెపి కక్షసాధింపు ఏమీ లేదన్నారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లే అధికారంలో వచ్చింది మొదలు అందరిపై కక్షసాధింపుకు దిగిన బిఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి అందరూ అలాగే చేస్తారని అనిపిస్తున్నట్లుందని అన్నారు.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11న ఈడీ ముందు ఆమె హాజరుకాబోతున్నారు. మరోవైపు రేపు జంతర్ మంతర్ వేదికగా మహిళా బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తూ..కవిత దీక్ష చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. రేపు జరగబోయే దీక్షకు 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. 29 రాష్ట్రాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాడే సంఘాలు,…
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై ఇప్పుడు హాట్ టాపిక్. ఇవాల ఢిల్లీకి ఈడీ కార్యాలనికి రావాలని ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈనేపథ్యంలో కవిత ఈడీకి లేఖ రాశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త సంచలంగా మారింది.