దేశరాజదాని ఢిల్లీలో ఎండ తీవ్రత పెరిగింది. వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. వేడిగాలుల నేపథ్యంలో పాఠశాలలకు ఢిల్లీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎన్జీ ధరలు పెరగడంతో దేశ రాజధాని నగరం పరిధిలో ఆటో, ట్యాక్సీ ధరలను పెంచేందుకు కేజ్రీవాల్ సర్కార్ ఆమోదం తెలిపింది.
ఆర్థిక నేరస్థుడు, రూ. 200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్లాది రూపాయలు ఇచ్చినట్లు తెలిపాడు. జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేంద్రజైన్ బలవంతంగా తన నుంచి రూ.10 కోట్లు వసూలు చేశారని ఆరోపించాడు.
ఇప్పటికే మద్యం విధానంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ సర్కారుకు లోఫ్లోర్ బస్సుల వ్యవహారం రూపంలో మరో చిక్కు వచ్చి పడింది. ఢిల్లీలో 1,000 లో–ఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు.
Delhi Ban On Firecrackers: ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దీపావళికి కూడా ఢిల్లీ నగర పరిధిలో ఎలాంటి ఫైర్ క్రాకర్స్ కు అనుమతి ఇవ్వడం లేదు. తాజాగా ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఈ సారి కూడా ఢిల్లీ పరిధిలో ఫైర్ క్రాకర్స్ పై నిషేధం ఉంటుందని ప్రకటించారు. ఆన్ లైన్ లో కూడా పటాకుల అమ్మకాలపై కూడా నిషేధం ఉంటుందని.. నిషేధాన్ని కఠినంగా అమలు చేసేలా కార్యాచరణ ప్రణాళికను…
CBI searched Delhi Deputy CM's bank lockers: ఢిల్లీ మద్యం స్కామ్ లో సీబీఐ దూకుడు పెంచింది. ఏ1 నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన లాకర్లను మంగళవారం పరిశీలించారు సీబీఐ అధికారులు. దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లోని ఘజియాబాద్ సెక్టార్ 4లో ఉన్న పీఎన్బీ బ్యాంచ్ లో ఐదుగురు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాలపై మనీష్ సిసోడియా స్పందించారు. సీబీఐ అధికారుల దాడుల్లో ఏమీ దొరకలేదని ఆయన…
బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ అని, వారు దేశాన్ని కూడా అలాగే ఉంచాలని చూస్తున్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. ఇతర రాష్ట్రాల్లో మూసివేసినట్లే దేశ రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు.
దేశంలోని ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చివేయడానికి బీజేపీ 6,300 కోట్ల రూపాయలను ఖర్చు చేయకపోతే, ఆహార పదార్థాలపై కేంద్రం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధించాల్సిన అవసరం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం పేర్కొన్నారు.
బీజేపీపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను వరుసగా హత్య చేస్తున్న సీరియర్ కిల్లర్ బీజేపీ అంటూ మండిపడ్డారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కారును కూడా కూల్చేందుకు బీజేపీ యత్నించిందని, బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలోకి లాక్కోవాలని యత్నించిందని.. కానీ ఆప్ నేతలు వారి బుట్టలో పడలేదని ఆయన అన్నారు.