Delhi School Holidays: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం చలిగాలులు, పొగమంచు దృష్ట్యా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలకు సెలవులు పొడిగించబడ్డాయి. జనవరి 10 వరకు పాఠశాలలు మూతపడతాయని విద్యాశాఖ డైరెక్టరేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Delhi Air Pollution: చలికాలంలో రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. అప్పటికి పంట పూర్తి కావడం.. దీంతో పొలాల్లోని మొలకలను రైతులు తగలబెట్టడం వల్ల పొగ విపరీతంగా గాల్లోకి చేరి కాలుష్యం ఏర్పడుతుంది.
Delhi Auto Rickshaws: దేశ రాజధాని ఢిల్లీలోని ఆటో-రిక్షా డ్రైవర్లు తమ వాహనాల లొకేషన్‌ను ట్రాక్ చేయడానికి తప్పనిసరిగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) అమర్చుకోవాలని చూసుకోవాలని రవాణా శాఖ ఆదేశించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగర పాలక సంస్థ సేవలు మరియు విజిలెన్స్ విభాగాలను అతిషికి అప్పగించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ప్రతిపాదనను పంపినట్లు అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి.
Medicine: ఇప్పుడు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ దుకాణాలు వినియోగదారులకు మందులను విక్రయించలేవు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను విక్రయించకూడదని మెడికల్ షాపులను ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.
త మూడు ఆర్థిక సంవత్సరాల్లో ప్రకటనల కోసం చేసిన ఖర్చులకు లెక్కలు చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం కోరింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోరుతూ, వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయాలని ఆప్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు అతిషికి ఢిల్లీ మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళిక, ఆదాయానికి సంబంధించిన అదనపు బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు విభాగాలు గతంలో కైలాష్ గెహ్లాట్ వద్ద ఉండేవి.
ఢిల్లీలో పాలనా వ్యవహారాలపై నియంత్రణ అధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పును వెలువరించింది. సుప్రీం తీర్పుతో కేజ్రీవాల్ సర్కార్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఎన్నికైన ప్రభుత్వానికే అసలైన అధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.