Serial killer: 24 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ‘‘సీరియల్ కిల్లర్’’ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కిల్లర్ అజయ్ లాంబాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. క్యాబ్ డ్రైవర్లను టార్గెట్ చేస్తూ చంపే లాంబా, ఢిల్లీ, ఉత్తరాకండ్ అంతటా అనేక మర్డర్లకు పాల్పడే ముఠాను నడించాడనే ఆరోపణలు ఉన్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాను బెదిరించిన వ్యక్తిని ఘజియాబాద్, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం అరెస్టు చేసింది. కొత్వాలి ప్రాంతం నుంచి శ్లోక్ త్రిపాఠి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అనంతరం అతన్ని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు తన భార్యతో గొడవపడి మద్యం మత్తులో ఉన్నప్పుడు ఫోన్ చేసి బెదిరించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Delhi court: బహిరంగంగా ‘‘పొట్టి దుస్తులు’’ ధరించడం నేరం కాదని ఢిల్లీ కోర్టు పేర్కొంది. గత ఏడాది బార్‌లో అశ్లీల నృత్యం చేసినందుకు అభియోగాలు ఎదుర్కొంటున్న ఏడుగురు బార్ డ్యాన్సర్లను నిర్దోషులుగా ప్రకటించింది. ఫిబ్రవరి 4న తీర్పు ఇచ్చిన కోర్టు.. డ్యాన్స్ వల్ల ప్రజలకు చిరాకు కలిగిస్తేనే చర్యలు తీసుకోవచ్చని తీర్పు చెప్పింది.
మీరట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరుడుగట్టిన నేరస్థుడు సోను మట్కాను హతమార్చింది ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం. సోనూ మట్కా హషీం బాబా ముఠాలో సభ్యుడిగా ఉన్నాడు. అతనిపై రూ.50,000 రివార్డు కూడా ఉంది. అయితే.. దీపావళి రోజు రాత్రి షహదారాలో మామ, మేనల్లుడి జంట హత్యలకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు కోసం.. ఢిల్లీ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.
Delhi : ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ట్రిపుల్ మర్డర్ సంచలనం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కత్తితో పొడిచి చంపారు. ఇంట్లో తల్లిదండ్రులు, కుమార్తె మృతదేహాలు లభ్యమయ్యాయి.
iPhone: తన గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వడానికి ఏకంగా ఓ బాలుడు అమ్మ నగలనే దొంగిలించాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తనతో గర్ల్ ఫ్రెండ్‌కి పుట్టిన రోజున ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు బంగారాన్ని చోరీ చేశాడు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతంలో జరిగింది. ఈ ఆరోపణలపై బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కత్తితో బెదిరించి 14 ఏళ్ల బాలుడిపై అతడి స్నేహితులు అసహజ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మరువకముందే.. మరో ఘటన చోటుచేసుకుంది. అసహజ శృంగారానికి బలవంతం చేసిన 20 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో జనవరి 17న జరగ్గా.. 19న విషయం వెలుగులోకి వచ్చింది. తలపై బండ రాయితో కొట్టడంతో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. నిందితుడు బిహార్‌కు చెందిన…
Delhi:దేశరాజధాని ఢిల్లీలో ప్రతి మనిషిని కలచివేసే ఘటన వెలుగు చూసింది. ఇక్కడ 16 ఏళ్ల బాలుడు తన పొరుగున నివసిస్తున్న 17 ఏళ్ల మైనర్‌ను కత్తితో పొడిచి చంపాడు. నిందితుడు అతడి ఛాతీ, మెడపై ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 60 సార్లు కత్తితో దాడి చేశారు.
Delhi Father Kills His Son: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తన ఇద్దరు కొడుకుల గొంతు కోసి అనంతరం ఆత్మహత్యకు ఒడిగట్టాడు ఓ తండ్రి. ఈ ఘటనలో రెండేళ్ల బాలుడు మరణించగా.. మరో బాలుడు, ఆ తండ్రి విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. వాయుయ్య ఢిల్లీలోని భరత్ నగర్ వజీర్‌పూర్ జేజే కాలనీలో మెకానిక్‌గా పనిచేస్తున్న రాకేష్ (35) భార్య, ఇద్దరు కుమారులతో నివసిస్తున్నాడు. ఈ…
OYO: ఓయో హోటల్లో రెండు మృతదేహాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ కేసులో ఓ యువకుడు మహిళను హోటల్‌కు పిలిచి హత్య చేసి తను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.