Delhi: కరెంట్ షాక్‌తో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- ప్రియుడిలో కలిసి భర్తను చంపిన భార్య..
- ఢిల్లీ ద్వారకా నగర్‌లో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి..
- ఇద్దరూ కుట్ర పన్ని చంపినట్లు వాట్సాప్ చాట్‌తో వెలుగులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలోని ద్వారకాలో 36 ఏళ్ల వ్యక్తి కరెంట్ షాక్‌తో మరణించాడు. అయితే, ఈ సంఘటనలో అతని భార్య, ఆమె ప్రియుడి కుట్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. మరణించిన వ్యక్తిని కరణ్ దేవ్‌గా గుర్తించారు. ఉత్తమ్‌నగర్‌లో మాతా రూప్రాణి మాగో ఆస్పత్రి నుంచి జూలై 13న పీసీఆర్ వచ్చినట్లు పోలీసులు చెప్పారు. వ్యక్తిని అతని భార్య, ఆమె లవర్ అయిన కరణ్ మామ కుమారుడు కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Read Also: CM Revanth Reddy : భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
మృతుడి భార్య, ఆమె ప్రియుడు కరణ్‌కు నిద్రమాత్రలు ఇచ్చి, మత్తు వచ్చిన తర్వాత విద్యుత్ షాక్ ఇచ్చి చంపినట్లు ఆరోపించారు. హత్య తర్వాత ఆమె తన సమీపంలోని అత్తమామల ఇంటికి వెళ్లి కరణ్ చనిపోయినట్లు సమాచారం అందించింది. వారు అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడు స్పందించలేని స్థితిలో ఆస్పత్రికి తీసుకువచ్చారు.
‘‘ప్రారంభంలో కరణ్ కుటుంబం ఎలాంటి ఆరోపణలు చేయలేదు. పోస్టుమార్టం పరీక్ష కూడా వద్దనుకుంది. అయితే, చిన్న వయసు పరిగణలోకి తీసుకుని, ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ (DDU) ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించబడింది’’ అని ద్వారకా డీసీపీ అంకిత్ సింగ్ చెప్పారు. బుధవారం కరణ్ తమ్ముడు కునాల్ దేవ్, తన అన్న మరణం చుట్టూ ఉన్న పరిస్థితులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసుల్ని ఆశ్రయించారు. కరణ్ భార్య, ఆమె భాగస్వామి కలిసి అతడిని చంపాలని ప్లాన్ చేసినట్లు వాట్సాప్ చాట్‌లో గుర్తించినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇద్దరిపై హత్య నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?