Delhi: ఢిల్లీ సీఎంను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్.. తప్ప తాగి పెళ్లాంతో గొడవ పడి…
- ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాను చంపేస్తామంటూ ఫోన్ కాల్
- అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు, ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది
- నిందితుడి కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు
- కొత్వాలి ప్రాంతం నుంచి శ్లోక్ త్రిపాఠి అనే వ్యక్తిని అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాను బెదిరించిన వ్యక్తిని ఘజియాబాద్, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం అరెస్టు చేసింది. కొత్వాలి ప్రాంతం నుంచి శ్లోక్ త్రిపాఠి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అనంతరం అతన్ని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు తన భార్యతో గొడవపడి మద్యం మత్తులో ఉన్నప్పుడు ఫోన్ చేసి బెదిరించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాను చంపేస్తామని హెచ్చరించాడు. బెదిరింపులకు ఉపయోగించిన సిమ్ కార్డు గోరఖ్‌పూర్ చిరునామాతో నమోదు చేయబడింది. సిమ్ కార్డు నిందితుడి బంధువు పేరు మీద రిజిస్టర్ అయి ఉంది.
READ MORE: Hyderabad: సీఎం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. 65 వేల కొత్త ఆటో రిక్షాలకు అనుమతి
Also Read
ఇదిలా ఉండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను చంపేస్తానంటూ త్రిపాఠి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఘజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. ఆమెకు మరింత భద్రతను పెంచారు. కాల్ చేసిన దుండగుడు వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేశాడని ఘజియాబాద్ డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు, ముఖ్యమంత్రి భద్రతాధికారులకు చేరవేసినట్లు తెలిపారు. అనంతరం రంగంలోకి దిగిన బృందాలు నిందితుడిని కొనుగొన్నాయి.
READ MORE: Nirmala Sitharaman: టీచర్‌గా మారిపోయిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!