Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం 8 గంటల విచారణ తర్వాత సీబీఐ అధికారులు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఈ రోజు ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు. తాజాగా 5 రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గతేడాది ఆగస్టులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెరపైకి వచ్చింది. ఇందులో ఏ-1గా మనీష్ సిసోడియాను పేర్కొంది సీబీఐ. గత ఆదివారమే ఆయన్ను విచారణకు రమ్మని కోరగా..బడ్జెట్ తయారీలో బీజీగా ఉన్నానని సమయంలో కోరడంతో నిన్న ఆదివారం విచారణకు హాజరుకావాలని సీబీఐ సమన్లు జారీ చేసింది. విచారణకు వెళ్లే కొన్ని గంటల ముందు, సిసోడియా తనకు జైలుకు వెళ్లడం అంటే భయం లేదని, భగత్ సింగ్ అనుచరుడిని అంటూ పరోక్షంగా అరెస్ట్ పై సంకేతాలు ఇచ్చారు.
Read Also: Ranbir Kapoor: రణబీర్ కపూర్ అందులో ఉన్నట్టా? లేనట్టా?
ఈ కేసులో డిజిటల్ డివైస్ లను నుంచి డిలీట్ చేసిన పలు ఫైళ్లు సిసోడియా అరెస్ట్ కు కారణం అయినట్లు సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ మధ్యం కేసు తర్వాత సిసోడియా 18 మొబైళ్లను, 4 సిమ్ కార్డులను ఛేంజ్ చేసినట్లు సీబీఐ తెలిపింది. గతేడాది గోవా ఎన్నికల సమయంలో ఈ స్కామ్ లో వచ్చిన డబ్బు రూ.100 కోట్లను ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉపయోగించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుతో తెలుగు రాష్ట్రాలకు కూడా లింకులు ఉన్నాయి.
ఇదిలా ఉంటే సిసోడియాను అరెస్ట్ చేయడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీలను దుర్వినియోగం చేస్తూ.. ప్రతిపక్షాలను అణిచివేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది సీబీఐ అధికారులు మనీష్ సిసోడియా అరెస్టును వ్యతిరేకించినట్లుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క కాంగ్రెస్, సీపీఎం మినహా అన్ని ప్రతిపక్ష పార్టీలు సిసోడియా అరెస్ట్ ను తప్పుపట్టాయి. ఈ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాస్టర్ మైండ్ అని ఆయనను అరెస్ట్ చేయాలని ఢిల్లీ కాంగ్రెస్ విభాగం డిమాండ్ చేసింది. సిసోడియా అరెస్టును సమర్థించింది.