తన భార్య జూనియర్ అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ప్రియుడితో హోటల్‌లో ఏకాంతంగా గడిపిన సీసీటీవీ ఫుటేజ్‌ను ఇవ్వాలని భారత సైన్యంలో మేజర్‌గా పని చేస్తున్న ఒక అధికారి ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్ విచారించిన పాటియాలా హౌస్ కోర్టు న్యాయమూర్తి వైభవ్ ప్రతాప్ సింగ్ కొట్టేశారు. హోటల్‌లో బుకింగ్ వివరాలు, సీసీటీవీ ఫుటేజ్ అనేది గోప్యతకు సంబంధించిన విషయాలు అని తెలిపింది. ఒక వ్యక్తి.. మరొక వ్యక్తి భార్యను దొంగిలించాడనే ఆలోచన పాత విషయం అని వ్యాఖ్యానించారు. సీసీటీవీ ఫుటేజ్ కోరడమంటే మహిళల నుంచి స్వతంత్రతను తీసివేస్తుందని.. అంతేకాకుండా వారిని అమానవీయంగా మారుస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mahesh Babu : ఖలేజా రీ-రిలీజ్‌కు ఊహించని బుకింగ్స్..
భార్య.. తన జూనియర్ అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆర్మీ మేజర్ అనుమానించాడు. దీంతో ఆమెతో విడాకులు తీసుకునేందుకు సిద్ధపడ్డాడు. అయితే వివాహేతర సంబంధాన్ని బయటపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. అందుకు ఆధారాలు లభించలేదు. అయితే భార్య.. ప్రియుడితో కలిసి హోటల్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను బయటపెట్టాలని అనుకున్నాడు. కానీ ఫుటేజ్ ఇచ్చేందుకు హోటల్ సిబ్బంది నిరాకరించారు. దీంతో మేజర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తనకు సీసీటీవీ ఫుటేజ్ ఇప్పించాలని అభ్యర్థించాడు. కానీ కోర్టు అందుకు అంగీకరించలేదు. ప్రైవేటు వివాదాలకు దర్యాప్తు సంస్థలుగా లేదా అంతర్గత విచారణల్లో సాక్ష్యాలను సేకరించే సాధానాలుగా న్యాయస్థానాలు పని చేయవని న్యాయూమూర్తి తెలిపారు. సాక్ష్యాలకు స్పష్టమైన చట్టపరమైన హక్కు లేనందున పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. భార్య, ఆమె ప్రియుడితో హోటల్‌లో ఉండే హక్కు ఉందని.. వారి గోప్యతా ప్రాథమిక హక్కు అని కోర్టు అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: Gold Rates: మళ్లీ భగ్గుమన్న పసిడి ధరలు.. రూ. 500 పెరిగిన తులం గోల్డ్ ధర