Land for jobs Scam: మనీ లాండరింగ్ కేసులో లాలూ, తేజస్వినీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు
- మనీ లాండరింగ్ కేసులో లాలూ ప్రసాద్.. తేజస్వినీ యాదవ్‌కు నోటీసులు..
- లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో జరిగిన ‘భూమికి ఉద్యోగం కుంభకోణం..
- భూమికి ఉద్యోగం కుంభకోణంతో లింక్ ఉన్న అందరికి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Land for jobs Scam: మనీ లాండరింగ్ కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వినీ యాదవ్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న టైంలో జరిగిన ‘భూమికి ఉద్యోగం కుంభకోణంతో సంబంధమున్న మనీలాండరింగ్ స్కామ్ కేసులో కోర్టు సమన్లు జారీ చేసింది. ఏకే ఇన్ఫోసిస్ లిమిటెడ్‌కు డైరెక్టర్ ప్రతాప్ యాదవ్‌కు, మరికొందరికి కూడా న్యాయస్థానం నోటీసులు పంపింది. అక్టోబరు 7వ తేదీ లోపు తమ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Also: BJP MP Laxman: ప్రధాని మోడీ వంద రోజుల పాలన ట్రైలర్ మాత్రమే..
Also Read
- Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
కాగా, 2004 నుంచి 2009 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేసిన టైంలో భారతీయ రైల్వేలో గ్రూప్-డి ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ అభియోగాలను నమోదు చేసింది. ఇదే వ్యవహారంపై నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టం కింద ఈడీ కేసు ఫైల్ చేసింది. గతేడాది మార్చిలో ఢిల్లీ, బీహార్, ముంబయిలలో మొత్తం 25 చోట్ల తనిఖీలు చేపట్టింది. ఆ తర్వాత లాలూ కుటుంబసభ్యులు ముగ్గురితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు, రెండు సంస్థల పేర్లతో ఛార్జిషీట్‌ను సీబీఐ రూపొందించింది. లాలూ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, కుమార్తెలు ఎంపీ మీసా భారతి, హేమా యాదవ్, లాలూ సన్నిహితుడు అమిత్ కత్యాల్, రైల్వే ఉద్యోగితో పాటు లబ్ధిదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హృదయానంద్‌లతో పాటు ఏకే ఇన్ఫోసిస్టమ్స్, ఏబీ ఎక్స్‌పోర్ట్స్‌లపై అభియోగాలను మోపింది.
తాజావార్తలు
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!