అవినీతి పార్టీ ఓటమితో అన్నా హజారే కూడా ఎంతో సంతోషిస్తారని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత.. పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ మాట్లాడారు.
ఢిల్లీ ఫలితాల్లో కాంగ్రెస్ జీరో హ్యాట్రిక్ కొట్టిందని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బీజేపీ విజయం తర్వాత పార్టీ ప్రధాన కార్యాలయంలో ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.
ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి లభించిదని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. దీన్ని పురస్కరించుకుని ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వహించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి బీజేపీ అగ్ర నేతలంతా చేరుకున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వ్యాపారవేత్త, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం వల్లే ఆప్ ఓడిపోయిందని రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు.
ఢిల్లీలో బీజేపీ విజయంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం, ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనంగా అభివర్ణించారు.. ఎన్నికల్లో ప్రచారం చేసి ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఏపీ సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు
ఆమ్ ఆద్మీ పార్టీ అంటే గుర్తుకొచ్చేది కేజ్రీవాల్, మనీష్ సిసోడియానే. ఆప్ పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ముందుండి విజయ తీరాలకు నడిపించిన నాయకులు. దశాబ్ద కాలం పాటు హస్తినలో చక్రం తిప్పిన నాయకులు. అంతటి ఉద్దండులు.. ఒక్క లిక్కర్ స్కామ్ వారి క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టింది.
దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని మొత్తానికి 27 ఏళ్ల తర్వాత కమలం పార్టీ కైవసం చేసుకుంది. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 47, ఆప్ 23 సీట్లు గెలుచుకున్నాయి. ఇక కేజ్రీవాల్ ఓటమి చెందడం ఆప్ పార్టీకి ఘోర పరాభవంగా చెప్పొచ్చు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ మెజారిటీ దిశగా సాగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ బైజయంత్ పాండా మాట్లాడారు. కొత్త సీఎంపై10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రతి రాష్ట్రంలోనూ తమకు సమిష్టి నాయకత్వం ఉందని చెప్పారు. అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. గెలిచిన అభ్యర్థులో ఎవరైనా సీఎంగా మారవచ్చాన్నారు. ఇతర పార్టీలలో బీజేపీలాగా సామాన్యులకు అవకాశాలు ఉండవన్నారు.